
డోంబివలీ, జనవరి 27: రెండేళ్ల పాప 13వ అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటూ పొరబాటున అక్కడి నుంచి కింద పడిపోయింది. అయితే కింద పడేముందు బాల్కనీ అంచు పట్టుకుని కాసేపు ఊగిన చిన్నారి.. ఆపై కిందకు జారి పడిపోవడం గమనించిన ఓ వ్యక్తి ఆపద్భాందవుడిలా మెరుపు వేగంతో వచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని డోంబివలీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమయస్పూర్తితో వ్యవహరించి చిన్నారి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని డోంబివలీలో స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ 13వ అంతస్తులోని బాల్కానీ వద్ద రెండేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కిందపడిపోయింది. భవనం కింద రోడ్డుపై పలువురు వ్యక్తులు ఉన్నప్పటికీ భవేశ్ అనే వ్యక్తి పాప కింద పడిపోవడాన్ని గమనించాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో పరుగులంకించి పడిపోతున్న పాపను పట్టుకోబోయాడు. కానీ అతని చెతుల్లో నుంచి జారడంతో.. పాప నేరుగా నేలకు ఢీ కొనకుండా ప్రమాద తీవ్రత తగ్గించగలిగాడు. దీంతో స్వల్పగాయాలతో బయటపడిన పాపను వెంటనే భజంపై వేసుకుని పరుగు పరుగున ఆస్పత్రికి వెళ్లాడు. బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారి.. కిందపడేముందు కాసేపు బాల్కనీ అంచును పట్టుకుని వేలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన గత వారం దేవిచాపాడు మండలంలో జరిగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
#Thane A young man Bhavesh Mhatre saved a 2-year-old child from falling from a 13-storey building in #Devichapada, #Dombivli, with his alertness and courage. The child is safe with minor injuries. The entire incident was captured on CCTV.#Kalyan #Life #saver #Maharashtra pic.twitter.com/Z88ileXVDh
— Mumbai Tez News (@mumbaitez) January 26, 2025
ఈ వీడియోలో భవేష్ మ్హత్రే చిన్నారిని పట్టుకోవడానికి పరిగెత్తడం కనిపిస్తుంది. అతను చిన్నారిని పూర్తిగా రక్షించలేకపోయినప్పటికీ.. అతని ప్రయత్నం వల్ల నేలను తాకే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగాడు. తాను భవనం వైపు వెళ్తుండగా చిన్నారి పడిపోవడం గమనించి, ఎలాగైన ప్రాణాలను కాపాడాలని నిశ్చయించుకున్నానని.. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకెళ్లానని తెలిపారు. ధైర్యం, మానవత్వానికి మించిన గొప్ప మతం మరొకటి లేదని ఆయన మీడియాతో అన్నారు. ఇక భవేష్ మ్హత్రే సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రియల్ లైఫ్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.