
విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ్స్‌లో ఎక్కువ లోడ్‌లో కరెంట్ ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లల దగ్గర డేంజర్ బోర్డులు పెట్టడంతో పాటు దాని చుట్టూ కంచెను వేస్తారు. మనుషులు అయితే ఈ హెచ్చరికలు చదవగలరు.. కానీ మూగజీవాలకు అవేంటో తెలియక హైవోల్టేజ్ కరెంట్ కారణంగా చాలాసార్లు ప్రాణాలు కోల్పోతాయి. అలాంటి హృదయవిదారక సంఘటన ఒకటి తాజాగా ఇండోర్‌లో చోటు చేసుకుంది.
స్థానిక సింధీ కాలనీ ప్రాంతానికి చెందిన జాగృతి నగర్ కూడలిలోని విద్యుత్ స్థంభంపైకి 10 అడుగుల పొడవైన పాము పాకుతూ ఎక్కేసింది. ఇక ఆ పాము గుర్రపు జాతికి చెందినది తెలుస్తోంది. అది దిగే ప్రయత్నంలో దానికి అకస్మాత్తుగా బలమైన హైవోల్టేజ్ షాక్ తగిలింది. అంతే ఒక్కసారిగా ఆ భారీ విషసర్పం 25 అడుగుల ఎత్తైన స్తంభం నుండి నేరుగా నేలమీద పడింది. దిగే ప్రయత్నంలో ఆ పాము పోల్‌పై అమర్చిన ఓపెన్ వైర్ నుంచి తప్పించుకుంది గానీ.. అనూహ్యంగా అక్కడ ఉన్న ఇనుప తీగకు తగలడంతో పెద్దగా పేలిన శబ్దం వచ్చింది.
నేలమీద నీరు, గడ్డి ఉండటంతో ఆ పాము చనిపోకపోయినా, తీవ్రంగా గాయపడింది. దాన్ని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. ఆ స్నేక్ క్యాచర్ గాయపడిన పామును ఒక సంచిలో తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#MadhyaPradesh : #Indore में बिजली के पिलर पर चढ़ गया 10 फुट लंबा घोड़ा पछाड़ सांप। करंट लगने से गिरा। देखें- कैसे खौफनाक मंजर pic.twitter.com/u1pW2DFyyd
— अमरजीत चौहान #प्रशासक समिति✊? (@iamarjeechauhan) June 9, 2021
రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. కుక్క ఓవర్ స్పీడ్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో
ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..
వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..