Viral Video: ఐదేళ్ళ బాలుడిపై కోతుల దాడి.. తనని తాను రక్షించుకోవడానికి బాలుడి ప్రయత్నం.. నెట్టింట్లో వీడియో వైరల్

|

Jul 15, 2024 | 9:44 AM

వైరల్ అవుతున్న వీడియోలో కోతులు తనపై దాడి చేస్తున్నప్పుడు ఆ బాలుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు వెంటనే స్పందించి ఆ చిన్నారి బాలుడిని కోతుల బారి నుంచి రక్షించేందుకు పరుగులు తీశారు. ఈ సంఘటన శుక్రవారం (జూలై 12) మధురలోని బృందావన్‌లో జరిగింది. బృందావన్‌లోని మదన్ మోహన్ ఘెరా ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి కిషన్ అనే తన ఐదేళ్ల బాలుడు ఏదో పని చెప్పాడు.

Viral Video: ఐదేళ్ళ బాలుడిపై కోతుల దాడి.. తనని తాను రక్షించుకోవడానికి బాలుడి ప్రయత్నం.. నెట్టింట్లో వీడియో వైరల్
Viral Video
Follow us on

ఐదేళ్ల బాలుడిపై కోతుల గుంపు పట్టపగలు దాడి చేసిన షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో వెలుగు చూసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కోతులు తనపై దాడి చేస్తున్నప్పుడు ఆ బాలుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు వెంటనే స్పందించి ఆ చిన్నారి బాలుడిని కోతుల బారి నుంచి రక్షించేందుకు పరుగులు తీశారు.

నివేదికల ప్రకారం ఈ సంఘటన శుక్రవారం (జూలై 12) మధురలోని బృందావన్‌లో జరిగింది. బృందావన్‌లోని మదన్ మోహన్ ఘెరా ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి కిషన్ అనే తన ఐదేళ్ల బాలుడు ఏదో పని చెప్పాడు. దీంతో కిషన్ ఇంటి నుంచి కృష్ణుడు గుడి వద్దకు వెళ్ళాడు. గుడి మెట్లపైకి కిషన్ వెళ్ళగానే ఒక్కసారిగా కోతులు ఆ బాలుడిపై దాడి చేశాయి.

ఇవి కూడా చదవండి

 

ఈ దాడిలో చిన్నారి గుడి మెట్లపై నుంచి కిందకు పడిపోయాడు. వెంటనే లేచి తన ఇంటి వైపు పరుగెత్తడం ప్రారంభించాడు. అయితే పరిగెడుతున్న బాలుడిపై వీధుల్లోని ఇతర కోతులు దాడి చేశాయి. . వీడియోలో నాలుగు కోతులు పిల్లవాడిని లాగి లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. దాడి సమయంలో కోతులు పిల్లాడిని కొట్టి నేలపైకి నెట్టాయి.

దాడి సమయంలో ఘటనా స్థలంలో ఉన్న కొంతమంది మహిళలు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. అయితే వారు ఆ బాలుడికి సహాయం చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. కొంత సమయం ఆ కోతులు చిన్నారిని పట్టుకుని కొడుతూనే ఉన్నాయి. చివరికి ఆ చిన్నారిని రక్షించేందుకు కొందరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లవాడిని వదిలి పారిపోతున్న కోతులను వారు తరిమికొట్టారు. కోతులు తనను వదిలిన వెంటనే పిల్లవాడు లేచి త్వరగా తన ఇంటి వైపు పరుగెత్తడం కనిపిస్తుంది.

ఇలాంటి సంఘటనలు పిల్లలపై జంతువులు ఎటాక్ చేయకుండా తగిన చర్యలు తీసుకోవడం గురించి తెలియజేస్తుంది. చాలా మంది పిల్లలు కుక్కలు, కోతుల దాడులతో బాధితులుగా మారుతున్నారు. తరచుగా కోతులు, కుక్కల వంటి జంతువుల దాడికి గురవుతున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..