Viral Video: భయానక వీడియో.. వైద్య పరీక్షలు చేస్తుండగానే ముంచుకొచ్చిన మృత్యువు! క్షణాల వ్యవధిలోనే..

|

Aug 20, 2024 | 8:49 AM

అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో కుప్పకూలి మృతి చెందాడు. డాక్టర్‌ వైద్య పరీక్షలు చేస్తుండగా అకక్మాత్తుగా ఉన్న చోటే పడిపోయాడు. ఈ భయానక ఘటర ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా..

Viral Video: భయానక వీడియో.. వైద్య పరీక్షలు చేస్తుండగానే ముంచుకొచ్చిన మృత్యువు! క్షణాల వ్యవధిలోనే..
Man Dies During Doctor's Check Up
Follow us on

ఇండోర్‌, ఆగస్టు 20: అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో కుప్పకూలి మృతి చెందాడు. డాక్టర్‌ వైద్య పరీక్షలు చేస్తుండగా అకక్మాత్తుగా ఉన్న చోటే పడిపోయాడు. ఈ భయానక ఘటర ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మృతుడు ఇండోర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన సోను మట్కర్‌ (31)గా గుర్తించారు. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో సమీపంలోని ఓ క్లినిక్‌కి వెళ్లాడు. అక్కడ డాక్టర్‌కి ఎదురూగా కుర్చీలో కూర్చుని ఉండగా.. డాక్టర్ పరీక్షిస్తూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో సోను ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన ఆదివారం (ఆగస్టు 18) తెల్లవారు జామున ఇండోర్‌లోని పరదేశిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోనూకి గుండెపోటు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మృతుడు సోనూకి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. సోనూ ఎల్‌ఐసీలో పనిచేసేవాడని అతని సోదరుడు గణేష్ తెలిపాడు. అయితే 5 నెలల క్రితం సోనూను అతనిపై అధికారులైన ఇద్దరు సీనియర్లు ప్రభాత్ కుమార్ సాహు, బఘ్రాయ్ మాఝీ ఎలాంటి కారణం లేకుండానే కేవలం మౌఖిక ఉత్తర్వు ద్వారా సోనూను ఉద్యోగంలో నుంచి తీసేశారు. అప్పనుంచి సోను తీవ్ర మనోవేదనకు గురవసాగాడు. ఈ నేపథ్యంలో తీవ్రంగా ఆలోచించి గుండెపోటుతో మృతిచెందాడు. ఉన్నతాధికారులు తనకు అన్యాయం చేశారని సోనూ స్నేహితులతో పదేపదే చెబుతుంటేవాడని తెలిపారు. దీనిపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.