Viral Video: విశ్వాసం, ప్రేమ అంటే ఇదే.. ఆహారం పెట్టిన వ్యక్తి మరణంతో మూగజీవి కోతి విలవిల.. 40 కి.మీ. ప్రయాణించి తుది వీడ్కోలు

|

Oct 14, 2023 | 12:20 PM

అమ్రోహా జిల్లాకు చెందిన రామ్‌కున్వర్‌ సింగ్‌ ప్రతి రోజూ ఒక కోతికి ఆహారం పెట్టేవాడు. రొట్టెలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. రోజులో కొంత సమయం ఆ కోతి అతడితో ఆడేది. కాగా, అక్టోబరు 10న రామ్‌కున్వర్‌ సింగ్‌ మరణించాడు. రోజూలాగే ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి విగతజీవిగా ఉన్న అతడ్ని చూసి తట్టుకోలేకపోయింది.

Viral Video: విశ్వాసం, ప్రేమ అంటే ఇదే.. ఆహారం పెట్టిన వ్యక్తి మరణంతో మూగజీవి కోతి విలవిల.. 40 కి.మీ. ప్రయాణించి తుది వీడ్కోలు
Monkey Last Tributes
Follow us on

తమను ఆదరించే మనుషుల పట్ల జంతువులు విశ్వాసంగా ఉంటాయి. వారికోసం తపిస్తాయి. వారిని వెన్నంటే ఉంటాయి. ఆవ్యక్తులు కనిపించకపోతే అల్లాడిపోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ కోతి తనకు రోజూ ఆహారం పెట్టి ఆదరించే వ్యక్తి మరణించడంతో తీవ్ర ఆవేదన చెందింది. మూగగా రోదించింది. ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించి అతని అంత్య్రకియల్లో సైతం పాల్గొని తుది వీడ్కోలు పలికింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లను కదిలిస్తోంది.

అమ్రోహా జిల్లాకు చెందిన రామ్‌కున్వర్‌ సింగ్‌ ప్రతి రోజూ ఒక కోతికి ఆహారం పెట్టేవాడు. రొట్టెలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. రోజులో కొంత సమయం ఆ కోతి అతడితో ఆడేది. కాగా, అక్టోబరు 10న రామ్‌కున్వర్‌ సింగ్‌ మరణించాడు. రోజూలాగే ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి విగతజీవిగా ఉన్న అతడ్ని చూసి తట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

వీడియో వైరల్

మృతదేహాన్ని పట్టుకొని మూగగా విలపించింది. రామ్‌కున్వర్‌ అంతిమయాత్రలోనూ అతని మృతదేహాన్ని వదలలేదు. 40 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని అతడి మృతదేహాన్ని వీడలేక వీడింది. తుది వీడ్కోలు చెప్పి అక్కడినుంచి కదలింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ మూగజీవి రామ్‌కున్వర్‌పై పెంచుకున్న అనుబంధానికి చలించిపోయారు.. తమ దైన శైలిలో కామెంట్లు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..