Video: బార్‌లో క్రిమినల్‌ బర్త్‌డే వేడుకలు.. బీరు తాగుతూ, బార్‌ గర్ల్‌తో పోలీస్ బాబాయ్‌ల స్టెప్పులు! వీడియో

క్రిమినల్‌ పుట్టిన రోజు వేడుకలు ఓ బార్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పార్టీకి ఏకంగా నలుగులు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. చేతిలో బీరు సీసాలు పట్టుకుని, బార్‌ గర్ల్‌తో డ్యాన్స్‌ చేస్తూ తెగ ఎంజాయ్‌ చేశారు. మద్యం మత్తులో జోరుగా డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో అవి కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

Video: బార్‌లో క్రిమినల్‌ బర్త్‌డే వేడుకలు.. బీరు తాగుతూ, బార్‌ గర్ల్‌తో పోలీస్ బాబాయ్‌ల స్టెప్పులు! వీడియో
UP cops dance at Criminal Birthday Celebrations

Updated on: Sep 30, 2025 | 12:55 PM

లక్నో, సెప్టెంబర్‌ 30: కరడుగట్టిన క్రిమినల్‌ పుట్టిన రోజు వేడుకలు ఓ బార్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పార్టీకి ఏకంగా నలుగులు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. చేతిలో బీరు సీసాలు పట్టుకుని, బార్‌ గర్ల్‌తో డ్యాన్స్‌ చేస్తూ తెగ ఎంజాయ్‌ చేశారు. మద్యం మత్తులో జోరుగా డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో అవి కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అవికాస్త పైఅధికారుల కంటపడటంతో దెబ్బకు వారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీమాపురి అవుట్‌పోస్ట్ పరిధిలో సోమవారం రాత్రి ఇర్షద్‌ మాలిక్‌ అనే ప్రముఖ క్రిమినల్‌ పుట్టిన రోజు వేడుకలు ఘజియాబాద్‌లోని ఓ బార్‌లో జరిగాయి. ఈ వేడుకలకు సాహిబాబాద్‌ బార్డర్‌ ఔట్‌పోస్ట్‌ ఇన్‌చార్జ్‌ ఆషిశ్‌ జాడోన్‌తోపాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు హాజరయ్యారు. ఈ పార్టీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2:30 గంటల వరకు జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన కొన్ని క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు బీర్ బాటిళ్లను పట్టుకుని బార్ గర్ల్స్‌తో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఎంతో బాధ్యత కలిగిన పోలీసులు.. ఓ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బర్త్‌డే పార్టీ వచ్చి.. చేతిలో బీర్‌ బాటిళ్లు పట్టి, బార్‌ గర్ల్‌తో డ్యాన్స్‌ చేస్తూ స్టెప్పులు వేయడం వీడియోలో కనిపిస్తుంది. పైగా పోలీసుల ట్యాలెంట్‌ను అక్కడి కొందరు తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ వీడియో కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. సీనియర్ పోలీసు అధికారి నిమిష్ పాటిల్.. సదరు నలుగురు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.