Watch Video: వద్దని చెప్పినా వినకుండా వెళ్లారు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

కొందరు ఎలా ఉంటారంటే.. ఆ పనిచేయొద్దని ఎవరైనా చెబితే.. లేదు నేను అదే పనిచేస్తా అంటారు. తీరా కష్టాల్లో పడతారు. ఇక్కడ కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డుపై నుంచి ప్రమాదకరంగా వరదనీరు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో స్థానికులు వద్దని వారించిన ఇద్దరు యువకులు తమ జీపుతో రోడ్డు దాటేందకు ప్రయత్నించి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Watch Video: వద్దని చెప్పినా వినకుండా వెళ్లారు.. చివరకు ఏమైందో మీరే చూడండి..
Viral Video

Updated on: Aug 25, 2025 | 6:24 PM

గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంజాబ్‌లోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి. నదలు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నా. కొన్ని ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే కాలానుగుణ నది ఆదివారం ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ముల్లన్‌పుర్‌- జంతి రహదారిపై ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తున్నాయి. దీని వల్ల ఆ రోడ్డుపై రాకపోకలు నిలిచి పోయాయి. ఈ క్రమంలో జీపులో అక్కడికి వచ్చిన ఒక ఇద్దరు యువకులు.. స్థానికులు చెబుతున్నా వినకుండా.. ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తున్న రోడ్డును దాటేందుకు ప్రయత్నించారు.

తమ జీపును స్టార్ట్ చేసి కొద్దిదూరం వెళ్లారు. ఇంతలోనే నీటి ప్రవాహం మరింత పెరగడంతో.. జీపును కంట్రోల్‌ చేయలేక నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న అధికారులు జేసీబీ సహాయంతో జీపుతో పాటు ఆ ఇద్దరు యువులను కాపాడి బయటకు తెచ్చారు.

ఇది కూడా చదవండి: ఇంట్లోకి ఈడీ ఎంట్రీ.. భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

అయితే అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. చెప్పినప్పుడు వినకుంటే ఇలానే ఉంటుందని ఒకరు కామెంట్ చేయగా.. అందుకే చెప్పింది వినాలని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.