Currency Rain: ఓ మంచి పని కోసం కచేరీలో పాటపాడిన జానపద కళాకారులు.. లక్షల రూపాయలను కనకవర్షం కురిపించిన ప్రజలు

|

Dec 30, 2022 | 2:59 PM

ఓ మంచి పని కోసం చేపట్టిన ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన అభిమానులు.. ఆ సంగీత కచేరీకి మంత్రముగ్ధులైపోయారు. కళాకారులపై నోట్లవెదజల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదికూడా ఏ వెయ్యో రెండువేలో కాదు. కళాకారుల అభిమానం లక్షల్లో కురిసింది.

Currency Rain: ఓ మంచి పని కోసం కచేరీలో పాటపాడిన జానపద కళాకారులు.. లక్షల రూపాయలను కనకవర్షం కురిపించిన ప్రజలు
Devotees Shower Notes On Bhajan Singer
Follow us on

భారతదేశాన్ని కళలకాణాచి అంటారు. చిత్రకళ, శిల్పకళ, నాటకం, నాట్యం, సంగీతం, గానం ఇలా భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయి. ఒక్కో కళాకారుడితి ఒక్కోరకం ప్రతిభ.  సంగీతంతో రాళ్లను కరిగించడమే కాదు.. అ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరలు చేసే నేతన్నల కళకు పుట్టినిట్లు మన భారత దేశం. అటువంటి కళాకారులకు..నైపుణ్యాలకు లోటే లేదు భారతదేశంలో. నాటి రాజుల కాలం నుంచి నేటి వరకూ  కళను అభిమానించనివారుండరు. తాజాగా ఓ జానపద కళాకారుడు సంగీతానికి కనకవర్షం కురిపించింది. ఓ మంచి పని కోసం చేపట్టిన ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన అభిమానులు.. ఆ సంగీత కచేరీకి మంత్రముగ్ధులైపోయారు. కళాకారులపై నోట్లవెదజల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదికూడా ఏ వెయ్యో రెండువేలో కాదు. కళాకారుల అభిమానం లక్షల్లో కురిసింది.  ఈ కచేరీద్వారా సుమారు 50 లక్షల రూపాయలు సమకూరాయి. వివరాల్లోకి వెళ్తే..

బుధవారం స్వామి వివేకానంద నేత్రాలయం ట్రస్టు ఆధ్వర్యంలో నూతన కంటి ఆసుపత్రి నిధుల సేకరణ కోసం భజన కార్యక్రమం నిర్వహించారు. నవసారిలోని సుపా గ్రామంలో ఈ కచేరీ జరిగింది.  కచేరీలో భాగంగా కీర్తిదాన్ గాధ్వి , మరో జానపద గాయని ఊర్వశి రద్దియా ప్రదర్శన ఇచ్చారు. “కార్యక్రమానికి సుమారు రూ. 40-50 లక్షల విరాళాలు వచ్చాయి” అని గాయకుడు కీర్తిదాన్ గాధ్వి చెప్పారు.

సంగీత కచేరీలో పాటలు వినేందుకు వందలాది మంది సూపా గ్రామానికి చేరుకున్నారు. భజన కార్యక్రమంలో 10, 20, 50, 100, 500 రూపాయల నోట్ల వర్షం కురిపించారు. ఇందులో పెద్దలు కాకుండా పిల్లలు , యువకులు కూడా ఉన్నారు. వర్షం జల్లు కురిసిన నోట్ల మొత్తం విలువ 50 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్వి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నగదును కంటి సమస్యలు ఉన్నవారి చికిత్స కోసం ఉపయోగించనున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..