Anand Mahindra: ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా సంస్థ (Mahindra Group) చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా (Social Media) లో ఎప్పుడూ ఏక్టివ్ గా ఉంటారు. ఎవరైనా తమ తెలివి తేటలకు పదును పెడుతూ ప్రతిభను నిరూపించుకుంటే.. వెంటనే ఆనంద్ మహింద్రా స్పందించారు. అంతేకాదు తనకు నచ్చిన వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వాటిపై సందర్భానుసారంగా కామెంట్ జత చేస్తారు. అవసరం అయితే ఆ ప్రతిభకు అండగా నిలబడతారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ బుడ్డోడు పతిభపై మనసు పడేసుకున్నారు. ఆయన ట్వీట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ బుడతడు.. చేపలు పడుతున్నాడు. ఆ చిన్నారి బాలుడు చేపలు పట్టే విధానం చూసి..అందులోనే ఒక విజయ రహస్యం ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఆనంద్ మహీంద్రా.. రోజురోజుకి పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో.. ఈ దృశ్యాన్ని చూడటానికి వింతగా ప్రశాంతంగా ఉంది. అంతేకాదు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఎమింటంటే.. ఏంటంటే “సంకల్పం, చాతుర్యం, సహనం కలిస్తే దక్కేది విజయం” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ క్యాప్షన్ ఇచ్చారు.
This showed up in my inbox without commentary. It is strangely calming to watch in an increasingly complex world. A ‘short story’ that proves: Determination + Ingenuity + Patience = Success pic.twitter.com/fuIcrMUOIN
— anand mahindra (@anandmahindra) April 1, 2022
ఆ వీడియోలో..ఓ బాలుడు చేపలు పట్టేందుకు కాల్వ గట్టుకువెళ్ళాడు. అక్కడ ఒడ్డునే ఒక గిలక చట్రాన్ని బిగించి..గేలానికి మొనకు ఒకేసారి వేరు వేరుగా మూడు పిండి ముద్దలను పిక్స్ చేశాడు. అనంతరం ఆ బాలుడు.. గేలాన్ని నీళ్ళల్లోకి విసిరాడు. ఒడ్డున ఒక చిన్న చాప వేసుకుని.. దానిమీద కూర్చుని ఓపికగా చేపల కోసం ఎదురుచూస్తున్నాడు బాలుడు. కొంచెం సేపటి తర్వాత నీటిలో కదలలికలు కనిపించాయి. దీంతో బాలుడు ఆ గిలక సాయంతో గేలాన్ని నీటి నుంచి వెనకకు లాగాడు.. అప్పుడు గేలానికి చిక్కుకున్న రెండు భారీ చేపలు ఒకేసారి ఒడ్డుకు చేరుకున్నాయి. దీంతో ఆ చేపలను బాలుడు తీసుకుని సంతోషంతో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేర్ అవుతుంది. ఒక్కరోజులోనే 11 లక్షలకు పైగా వ్యూస్, 80 వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.
Also Read: Earthquake: తిరుపతి సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు