
ధరాశివ్ , ఏప్రిల్ 6: అప్పటి వరకు కోలాహలంగా సాగిన కాలేజీ ఫేర్వెల్ పార్టీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. స్టేజ్‌పై ప్రసంగిస్తున్న విద్యార్ధిని ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
మృతురాలిని పరందలోని ఆర్‌జి షిండే కళాశాలకు చెందిన వర్ష ఖర్రత్ (20)గా గుర్తించారు. ఘటనకు ముందు ఆమె స్టేజ్‌పై నవ్వుతూ ప్రసంగించడం వీడియోలో చూడొచ్చు. ఉన్నట్లుండి ఆమె ఒక్కసారిగా కుప్పకూలడంతో విద్యార్ధులంతా ఆమెను హుటాహుటీన పరాండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వర్షకు 8 యేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స జరిగింది. కానీ గత పన్నెండు సంవత్సరాలుగా ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించలేదు. అప్పటి నుంచి ఆమె ఎటువంటి మందులు తీసుకోకపోయినా ఎంతో ఆరోగ్యంగా ఉంది. అయితే వర్ష కాలేజీ ఫంక్షన్‌లో ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందింది.
भाषण करता करता कोसळली,
विद्यार्थीनीचा मृत्यू, धाराशीवमधील घटना#Dharashivnews #Viralvideo pic.twitter.com/hABp79JY2x— Gangappa Pujari (@GangappaPujar07) April 5, 2025
విద్యార్ధిని వర్ష మృతి పట్ల కళాశాల యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఒక రోజు సెలవు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.