Railway Track: బీహార్‌లో వింత దొంగతనం.. రాత్రికి రాత్రే రైల్వే ట్రాక్ మాయం.. స్క్రాప్ కింద అమ్మేసిన దొంగల ముఠా

కాపలాగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది చేతివాటం దొంగలకు కలిసొచ్చింది. అక్కడొక ట్రాక్ ఉండేదనే ఆనవాళ్లు కూడా లేకుండా మాయం చేసేశారు. తాజాగా ఈ విషయం బయటపడడంతో ఉన్నతాధికారులు స్పందించారు.

Railway Track: బీహార్‌లో వింత దొంగతనం.. రాత్రికి రాత్రే రైల్వే ట్రాక్ మాయం.. స్క్రాప్ కింద అమ్మేసిన దొంగల ముఠా
Railway Track

Updated on: Feb 07, 2023 | 12:08 PM

నాడు అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ..  గుడి, బడి అని లేదు ఎక్కడైనా ఎప్పుడైనా దొంగిలించడానికి ఏ వస్తువైనా ఒకే అంటున్నారు.. కొందరు దొంగలు .. తాజాగా కొందరు దొంగలు ఏకంగా రైల్వే ట్రాక్‌నే లేపేశారు. అవును చాలాకాలంగా మూతపడ్డ రైల్వే ట్రాక్ చోరీకి గురైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. కాపలాగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది చేతివాటం దొంగలకు కలిసొచ్చింది. అక్కడొక ట్రాక్ ఉండేదనే ఆనవాళ్లు కూడా లేకుండా మాయం చేసేశారు. తాజాగా ఈ విషయం బయటపడడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు సిబ్బందిపై వేటు వేశారు. ఘటనపై విచారణకు ఆదేశించి, నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ మిల్ ఉంది. ఈ ఫ్యాక్టరీకి రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్ ను వేసింది. అయితే, ఈ మిల్ మూతపడడంతో ఆ ట్రాక్ నిరుపయోగంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు కూడా ఆ ట్రాక్ ను పట్టించుకోవడం మానేశారు. సాధారణంగా ఇలా నిరుపయోగంగా మారిన ట్రాక్ ను రైల్వే శాఖ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, స్క్రాప్ కింద అమ్మేయాలి. కానీ ఈ ట్రాక్ విషయంలో అలాంటివేవీ జరగలేదు. దాంతో దీనిపై దొంగల దృష్టి పడింది. అంతే ట్రాక్ మాత్రం మాయమైంది. ప్రాథమిక విచారణలో కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి, ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో ట్రాక్ ను అమ్మేసి సొమ్ము చేసుకున్నారని వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us