Inspired Person: క్యారమ్ టోర్నమెంట్‌లో పతకాలు గెలుచుకున్న 83 ఏళ్ల బామ్మ.. నీవు మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు

మనవడు.. క్యారమ్ గేమ్‌లో తన బామ్మ మరో మహిళతో పోటీ పడుతున్న 21 సెకన్ల వీడియోను పంచుకున్నాడు. బామ్మ ఎంతో చాకచక్యంగా కొన్ని షాట్‌లు ఆడింది. కాయిన్ కొడుతున్న సమయంలో ఆ బామ్మ  దృష్టి ఏకాగ్రత అందరిని ఆకట్టుకుంది.

Inspired Person: క్యారమ్ టోర్నమెంట్‌లో పతకాలు గెలుచుకున్న 83 ఏళ్ల బామ్మ.. నీవు మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు
Pune Carrom Tournament

Updated on: Jan 11, 2023 | 1:09 PM

వయసుతో సంబంధం ఏముంది.. సాధించాలనే సంకల్పం ఉంటే అని అనేక మంది వృద్ధులు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా పుణెకు చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల ఏదైనా సాధించాలనుకుంటే ఏజ్ అడ్డుకాదని నిరూపించింది. ఇంటర్నెట్ ఖాతాదారులకు తన బామ్మ చేసిన గొప్పపని తెలియజేస్తూ.. పూణేలో క్యారమ్ టోర్నమెంట్‌లో తన బామ్మ విజయం సాధించినందుకు గర్వంగా ఉందంటూ  మనవడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

పూణేలో జరుగుతున్న ఆల్-మగర్‌పట్టా సిటీ క్యారమ్ టోర్నమెంట్‌లో డబుల్స్ , సింగిల్స్ విభాగాల్లో తన 83 ఏళ్ల బామ్మ సాధించిన విజయాల గురించి బామ్మ మనవడు.. లాయర్ ..  ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి అక్షయ్ మరాఠే ట్వీట్ చేశారు. ఈ 83 ఏళ్ల బామ్మ మహిళ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

మనవడు.. క్యారమ్ గేమ్‌లో తన బామ్మ మరో మహిళతో పోటీ పడుతున్న 21 సెకన్ల వీడియోను పంచుకున్నాడు. బామ్మ ఎంతో చాకచక్యంగా కొన్ని షాట్‌లు ఆడింది. కాయిన్ కొడుతున్న సమయంలో ఆ బామ్మ  దృష్టి ఏకాగ్రత అందరిని ఆకట్టుకుంది.  83 ఏళ్ల ఆజీ తమకు ఎంతో ప్రేరణ ఇచ్చిందంటూ ట్విట్స్ చేస్తున్నారు. బామ్మ సాధించిన విజయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వైరల్ పోస్ట్‌కి ఇప్పటివరకు సోషల్ మీడియాలో 300 లైక్‌లు, దాదాపు 30,000 వీక్షణలు వచ్చాయి.  మనవడు తన బామ్మతో  ప్రాక్టీస్ చేసినందుకు తన స్నేహితులకు ఈ గెలుపులో భాగం ఉందంటూ క్రెడిట్ ఇచ్చాడు. బామ్మతో క్యారమ్ ఆడుతున్న చిత్రాలను పోస్ట్ చేశాడు. ఇంటర్నెట్ వినియోగదారులు బామ్మ గెలిచినందుకు ప్రశంసించారు. తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. “చాలా బాగుంది ..  స్ఫూర్తిదాయకం, అభినందనలు” అని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..