గుడి ప్రాంగణ చెరువులో దొరికిన 50 కిలోల తాబేలు.. భుజాన వేసుకుని పరారైన గ్రామస్థులు

|

Sep 27, 2023 | 8:25 AM

వందల ఏళ్ల నాటి అరుదైన తాబేలు లభ్యమైంది. దాదాపు 50 కిలోలకుపైగా బరువు ఉన్న ఆ తాబేలును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ హంగమా చేశారు. ఇంతలో కొందరు గ్రామస్థులు దానిని తీసుకుని పరుగు లంకించుకున్నారు. బీహార్‌లోని బక్సర్‌లోని శివసాగర్ చెరువులో 100 ఏళ్ల తాబేలు లభ్యం కావడంతో ఈ విచిత్ర సంఘటన జరిగింది..

గుడి ప్రాంగణ చెరువులో దొరికిన 50 కిలోల తాబేలు.. భుజాన వేసుకుని పరారైన గ్రామస్థులు
50 Kgs Tortoise
Follow us on

పట్నా, సెప్టెంబర్‌ 27:  ఆ ఊరి గుడి ప్రాంగణంలో వందల ఏళ్ల నాటి అరుదైన తాబేలు లభ్యమైంది. దాదాపు 50 కిలోలకుపైగా బరువు ఉన్న ఆ తాబేలును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ హంగమా చేశారు. ఇంతలో కొందరు గ్రామస్థులు దానిని తువాలులో మూటకట్టుకుని భుజాన వేసుకుని పరుగు లంకించుకున్నారు. బీహార్‌లోని బక్సర్‌లోని శివసాగర్ చెరువులో 100 ఏళ్ల తాబేలు లభ్యం కావడంతో ఈ విచిత్ర సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

బీహార్‌లోని బక్సార్‌ జిల్లాలోని బ్రహ్మపుర్‌లో ఉన్న బాబా బ్రహ్మేశ్వరనాథ్‌ ఆలయ ప్రాంగణంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. బీహార్‌ ప్రభుత్వం దాదాపు రూ.8 కోట్ల వ్యయంతో గత ఆరు నెలలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల ఆలయ ప్రాంగణంలోని చెరువులోని పాత నీటిని తోడి కొత్త నీటిని నింపే ప్రక్రియను ప్రారంభించారు. ఆ సమయంలో చెరువులో నుంచి భారీ తాబేలుతో పాటు కొన్ని చేపలు లభ్యమయ్యాయి. దీంతో వాటిని చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. సెల్‌ ఫోన్లతో వీడియోలు తీసకునేందుకు పోటీ పడ్డారు. సదరు వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు కూడా.

ఇంతలో అక్కడికి చేరుకున్న పలువురు గ్రామస్థులు తువ్వాలులో భారీ తాబేలును బంధించి అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఈ వార్త కాస్తా అటవీ శాఖ అధికారులకు చేరింది. దీంతో తాబేలు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. తాబేళ్లు వంటి పలు రకాల జంతువులను పట్టుకోవడం, బంధించడం, విక్రయించడం, తినడం వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం చట్టరీత్యానేరమని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారిని ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.