Viral News: ఓ వైపు దేశం ఆకాశంలో జీవరాశుల కోసం అన్వేషణ సాగించే దిశగా అడుగు వేస్తోంటే.. మరోవైపు కనీస సౌకర్యాలు లేక అనేక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు , భారీ, వర్షాలు కురిసిన సమయంలో అడవి బిడ్డలు, నదీపరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది తాజా సంఘటన. రోడ్డు సదుపాయం లేకపోవడంతో.. భారీ వరద నీటిలో నదిని దాటుకుంటూ.. ఓ మృత దేహానికి అంతిమ యాత్రను నిర్వహించారు బంధువులు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
శివమొగ్గ జిల్లాలో తీర్థహళ్లి మండలం కొడ్లు గ్రామం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి గురైంది. రోడ్డు సదుపాయం లేకపోవడంతో.. మృతదేహాలను దహనం చేసేందుకు పీకల్లోతు నీటిలో దిగి ప్రయాణం చేయాల్సి వస్తోంది కొడ్లు గ్రామస్థులు. గ్రామం నుంచి శ్మశానవాటికకు వెళ్లేందుకు రోడ్డు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మృతదేహాన్ని దహనం చేసేందుకు వెళ్తున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన 80 ఏళ్ల తమ్మయ్య గౌడ్ మృతి చెందాడు. మృతదేహాన్ని దహనం చేయడం కోసం.. గ్రామస్తులు, కుటుంబసభ్యులు మృతదేహాన్ని భుజాలపై మోస్తూ.. దాదాపు 4 అడుగుల లోతు నీటిలో నడిచారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమకు వర్షాకాలం వస్తే.. ఇదే పరిస్థితి ఏర్పడుతుందని.. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరగ జనేంద్ర నియోజకవర్గంలో హోంమంత్రి ఆరగ వచ్చిన ప్రతిసారీ వర్షంలో శ్మశానవాటికకు వెళ్లే ఈ రహదారిని నిర్మించమని తాము విజ్ఞప్తి చేస్తున్నామని గ్రామస్తులు చెప్పారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. విశేషమేమిటంటే ఈ గ్రామం హోంమంత్రి ఆరగ జనేంద్ర నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 17న కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ పాఠశాల బస్సు నీటిలో చిక్కుకుంది. బస్సులో దాదాపు 150 మంది చిన్నారులు ఉన్నారు. ఉపాధ్యాయులు, స్థానికుల సహకారంతో పిల్లలందరినీ బస్సు నుంచి బయటకు తీసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..