వికాస్ దూబే అనుచరుల్లో ఒకరికి కరోనా పాజిటివ్

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముగ్గురు సహచరుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. హర్యానా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ముగ్గురిని నిన్న అరెస్టు చేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం.. ఈ ఇన్ఫెక్షన్ సోకిన నిందితులను వేరుగా మరో జైల్లో ఉంచవలసి ఉంటుంది. దూబే ముగ్గురు సహచరుల్లో ప్రభాత్ అనే వ్యక్తి ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. అయితే మిగిలిన ఇద్దరు సహచరుల్లో తండ్రీ కొడుకులైన శ్రవణ్, అంకుర్ అనే వారికి కూడా దూబే […]

వికాస్ దూబే అనుచరుల్లో ఒకరికి  కరోనా పాజిటివ్

Edited By:

Updated on: Jul 09, 2020 | 1:36 PM

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముగ్గురు సహచరుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. హర్యానా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ముగ్గురిని నిన్న అరెస్టు చేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం.. ఈ ఇన్ఫెక్షన్ సోకిన నిందితులను వేరుగా మరో జైల్లో ఉంచవలసి ఉంటుంది. దూబే ముగ్గురు సహచరుల్లో ప్రభాత్ అనే వ్యక్తి ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. అయితే మిగిలిన ఇద్దరు సహచరుల్లో తండ్రీ కొడుకులైన శ్రవణ్, అంకుర్ అనే వారికి కూడా దూబే నేరాలతో ప్రమేయమున్నట్టు భావిస్తున్నారు. కాన్పూర్ లోని శివపూర్ పోలీసు స్టేషన్ పరిధి లోని కామ్ పూర్ గ్రామానికి చెందిన వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు వెల్లడైంది. అతడిని వేరుగా జైలుకు తరలించారు.