TVK Party: నటుడు విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్‌ను కేటాయించిన ఈసీ

తమిళ నటుడు విజయ్ పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. ఇటీవలే విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీకి విజిల్ సింబల్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే తమ పార్టీకి గుర్తును కేటాయించాలని విజయ్ ఈసీకి దరఖాస్తు చేసుకోగా.. పూర్తి పరిశీలన తర్వాత విజయ్ పార్టీకి ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

TVK Party: నటుడు విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్‌ను కేటాయించిన ఈసీ
Echas Allotted The Whistle Symbol To Vijay's Tvk Party

Updated on: Jan 22, 2026 | 3:35 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాయి. అయితే ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సొంత పార్టీనికి పెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగంకు కామన్ సింబల్ దక్కించుకోవడంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే తమ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించాలని విజయ్ ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం తాజాగా విజయ్ టీవీకే పార్టీకి విజిల్‌ గుర్తును కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

అయితే ఇప్పటికే తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు విజయ్.. దీంతో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా బరిలోకి దిగననున్నట్టు తెలుస్తోంది. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి, నామ్ తమిళ్ కట్చి, టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతుండగా.. తాజాగా విజయ్ పార్టీకి సైతం ఎన్నికల గుర్తు కేటాయించడంతో ఆయన కూడా ఎన్నిల ప్రచారానికి వ్యూహాలు రచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.