వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే?

సినిమాలు కేవలం నాలుగు గోడల మధ్య వినోదాన్ని పంచడానికే కాదు, సమాజంలో గొప్ప చైతన్యాన్ని కూడా నింపగలవని నిరూపించే ఒక అద్భుత ఘట్టం చెన్నైలో జరిగింది. సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకన్ ఒక చిన్నారి జీవితంలో వెలుగులు నింపింది. థియేటర్‌లో విజయ్ చెప్పిన గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ పాఠం ఒక పోక్సో నేరస్థుడిని కటకటాల వెనక్కి నెట్టింది.

వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే?
Vijay Jananayagan Movie Impact

Updated on: Aug 08, 2026 | 10:53 AM

తమిళ చిత్రసీమలో విజయ్‌ది ప్రత్యేక ప్రస్థానం. ఆయన సినిమాల్లో కనిపించే విధానం, ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు సమాజంలో ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. ఆ ప్రజాదరణతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా స్పెషల్ యాక్షన్ ఫోర్స్ వంటి పథకాల ద్వారా మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఈ ఇష్టం.. ఆయన నటించిన చివరి చిత్రం జననాయకన్ సినీ తెరపైనే కాదు, ఒక చిన్నారి నిజ జీవితంలోనూ వెలుగులు నింపి, ఒక పోక్సో నేరస్థుడిని కటకటాల వెనక్కి నెట్టడం సంచలనంగా మారింది.

థియేటర్‌లో సినిమా.. నిజ జీవితంలో ధైర్యం

చెన్నై కేకే నగర్‌కు చెందిన ఓ 8 సంవత్సరాల చిన్నారి తన తండ్రితో కలిసి నివసిస్తోంది. ఆ పాప తల్లిదండ్రులు కొన్ని మనస్పర్థల వల్ల గడిచిన ఆరు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. తల్లి అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసి వెళ్లడమే కాకుండా తాను పనిచేసే ఇంటికి తీసుకెళ్లి రెండు రోజులు ఉంచుకుని మళ్లీ తండ్రి వద్దకు పంపేది. ఈ నేపథ్యంలో ఇటీవల చిన్నారి తండ్రి తన ఇద్దరు పిల్లలను విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు తీసుకెళ్లారు. సినిమా చూసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆ పాప తన తండ్రితో ఒక సంచలన విషయం తెలిపింది. సినిమా
ఈ సినిమాలో విజయ్ పిల్లలకుగుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి వివరించిన దృశ్యం చూసిన ఆ చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఉండే పెరియన్ అనే వ్యక్తి తనతో తప్పుగా ప్రవర్తించాడని తండ్రికి చెప్పింది. ఇది విని షాక్ అయిన తండ్రి, వెంటనే వడపళని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల చర్య.. నిందితుడి అరెస్ట్

తండ్రి ఫిర్యాదు ఆధారంగా పాపతో మాట్లాడిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. ఆ చిన్నారిపై బాధితుల వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

సినిమా సందేశం.. నెరవేరిన లక్ష్యం

తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరి సినిమా ఆధారంగా జననాయకన్ తెరకెక్కింది. ఇందులో ఆడపిల్లల రక్షణ, వారికి చిన్నతనం నుంచే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో విజయ్ పాత్ర ద్వారా చాలా బాగా చూపించారు. ఒక సినిమా చూసి 8 ఏళ్ల పాప ధైర్యంగా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం, నేరస్థుడికి శిక్ష పడేలా చేయడం గొప్ప విషయం.

Loading...
Unable to load recommendations.
Follow Us