భారత భూభాగంలో ప్రతి అంగుళం సురక్షితంగా ఉండేలా మోదీ ప్రభుత్వం చూస్తుందని, పూర్తి అప్రమత్తంగా ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరు.. మన రక్షణ దళాలు, నాయకత్వం దేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దులను రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగివున్నాయి అని అమిత్ షా చెప్పారు. ఈ విషయంలో ఎవరూ సందేహించాల్సిన పని లేదన్నారు. బీహార్ ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆయన.. ఆ రాష్ట్రంలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ తథ్యమన్నారు. ఎన్నికల తరువాత నితీష్ కుమార్ తిరిగి సీఎం అవుతారన్నారు. పశ్చిమ బెంగాల్ లో వచ్ఛే ఏడాది నాయకత్వ మార్పు జరుగుతుందని, ఆ స్టేట్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.