స్నేహం చేసిన వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్తున్న కొంగలు.. ఏం జరుగుతుందోనంటూ ప్రజల్లో టెన్షన్‌..

|

Apr 17, 2023 | 7:34 AM

ఆ కొంగ అతడు పెట్టే తిండికోసం రోజూ రావటం మొదలుపెట్టింది. క్రమంగా ఆ కొంగ అతనికి దగ్గరగా మెలగటం, అతని మాటలు వినటం, అతడు పొలంలో ఎక్కడుంటే అక్కడే వాలిపోవటం మొదలుపెట్టింది. మిగతా కొంగల గుంపులో వదిలేసి వెళ్లిపోవాలని ప్రయత్నించినా సరే, ఆ కొంగ మాత్రం..ఆయన్ను వదిలిపెట్టలేదు.

స్నేహం చేసిన వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్తున్న కొంగలు.. ఏం జరుగుతుందోనంటూ ప్రజల్లో టెన్షన్‌..
Mans Friendship With Crane
Follow us on

స్నేహానికి ఎళ్లలు లేవు. కులమత బేధాలు అసలే లేవు. జాతి అంతరాలు కూడా అడ్డురావు. మనుషులు తోటి మనిషితో మాత్రమే కాకుండా జంతువులు, పక్షులు, కొన్ని సందర్భాల్లో క్రూరమృగాలతో కూడా స్నేహం చేస్తుంటారు. మన చుట్టూ చాలా మంది కుక్కలు, పిల్లలు, మేకలతో స్నేహం చేస్తున్న వారిని చాలా మందినే చూసుంటాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమేథీ రైతు ఆరిఫ్ ఖాన్ గుర్జార్ కొంగస్నేహం గురించి ఇప్పటికే వార్తల్లో చూశాం. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో వ్యక్తికి కొంగకు మధ్య మైత్రి ఎలా ఉందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

యూపీలోని మౌకీకి చెందిన రామ్‌సముజ్‌ యాదవ్‌ అనే వ్యక్తికి ఒక రోజు తన పొలంలో కనిపించిన కొంగకు ఆహారం పెట్టాడు. దాంతో ఆ కొంగ మర్నాడు కూడా అతడు పెట్టే ఆహారం కోసం ఎదురుచూసింది. అలా ఆ కొంగ అతడు పెట్టే తిండికోసం రోజూ రావటం మొదలుపెట్టింది. క్రమంగా ఆ కొంగ అతనికి దగ్గరగా మెలగటం, అతని మాటలు వినటం, అతడు పొలంలో ఎక్కడుంటే అక్కడే వాలిపోవటం మొదలుపెట్టింది. మిగతా కొంగల గుంపులో వదిలేసి వెళ్లిపోవాలని ప్రయత్నించినా సరే, ఆ కొంగ మాత్రం..ఆయన్ను వదిలిపెట్టలేదు. ఇలా ఏడాదిగా ఆ వక్తితో ఈ కొంగ స్నేహం చేస్తోంది. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే, అమేథీ రైతు ఆరిఫ్ ఖాన్ గుర్జార్ ఒక గాయపడిన కొంగను కాపాడటంతో అది అతనితోనే ఉండిపోయింది. క్రమంగా వారి మధ్య స్నేహం ఏర్పడింది. అందుకు సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో అటవీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ పేరుతో అతని నుంచి కొంగను వేరుచేసి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇప్పుడు కూడా రామ్‌సముజ్‌ యాదవ్‌తో కొంగ స్నేహం చేస్తున్న విషయం అటవీ అధికారుల దృష్టికి చేరితే ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు, నెటిజన్లు.

వాస్తవానికి యూపీ రాష్ట్ర పక్షి అయినా ఈ కొంగను 1972 వన్యప్రాణి చట్టం కింద పెంచుకోవడం నేరం, పైగా ఇవి రెడ్‌లిస్ట్‌ పెట్‌ బర్డ్స్‌ జాబితాలో ఉండటంతో ఇవి పెంచడం చట్ట విరుద్ధం.

మరిన్ని జాతీయ వార్తల కోసం..