ఇళ్లు లేదు.. ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని కాళ్ల మీద పడ్డ మహిళ చెంపచెళ్లుమన్పించారు కర్నాటక మంత్రి సోమన్న. గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఆమెను మినిస్టర్ కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చామరాజునగర్ జిల్లా గుండ్లపేట తాలుకా హంగాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్న వ్యవహరించిన తీరు అందరిని షాక్‌కు గురిచేసింది. అందరికి ఇళ్ల పట్టాలు వచ్చాయని , తనకు మాత్రం రాలేదని మంత్రి కాళ్ల మీద పడ్డ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌తో పాటు కర్నాటకలో మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. అందరిముందే మహిళపై దాడి చేసిన మంత్రిని పదవి నుంచి తొలగించాలని , అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఘటనకు సంబంధించి వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి స్పందించారు. తాను అలా ప్రవర్తించి ఉండకూడదంటూ సారీ చెప్పారు. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది మంత్రి చేయి చేసుకున్న మహిళను స్థానికంగా నివశించే కెంపెమ్మగా గుర్తించారు. మహిళా సంఘాలు బాధితురాలికి బాసటగా నిలిచాయి. అర్హత ఉన్నా తనను ఎంపిక చేయలేదని.. ఆవేదన చెప్పుకునేందుక వెళ్లిన మహిళపై మంత్రి చేయి చేసుకోవడం సిగ్గచేటని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
#Karnataka
Housing minister and @BJP4Karnataka leader V Somanna was seen slapping a woman during an event held at Chamarajanagar district on Saturday. @IndianExpress pic.twitter.com/B0B8GbbWzJ— Kiran Parashar (@KiranParashar21) October 23, 2022
వీడియో బయటకు రావడంతో మంత్రిగారు సారీ చెప్పక తప్పలేదు. ఇలాంటి ఘటనలు కర్నాటకలో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. బెంగళూరులో వరదలు వచ్చినప్పడు.. తనను ప్రశ్నించిన ఓ మహిళపై స్థానిక భాజాపా శాసనసభ్యుడు అరవింద్ లింబావలి భూతులతో విరుచుకుపడ్డారు. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. అలాగే, జేడీఎస్ లీడర్ ఓ కళాశాల ప్రిన్సిపాల్‌కి చెంపపై కొట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం..