Viral Video: కో-పైలట్‎పై దాడి చేసిన ప్రయాణికుడు.. అసలు కారణం ఇదే..

|

Jan 15, 2024 | 12:55 PM

గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడికి, పైలట్ కి మధ్య గొడవ జరిగింది. పొగమంచు కారణంగా ప్రయాణం ఆలస్యమైందని ఆరోపిస్తూ ఓ ప్రయాణికుడు పైలట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన విమానం (6E 2175)లో చోటు చేసుకుంది.

Viral Video: కో-పైలట్‎పై దాడి చేసిన ప్రయాణికుడు.. అసలు కారణం ఇదే..
Indigo Flight
Follow us on

గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడికి, పైలట్ కి మధ్య గొడవ జరిగింది. పొగమంచు కారణంగా ప్రయాణం ఆలస్యమైందని ఆరోపిస్తూ ఓ ప్రయాణికుడు పైలట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన విమానం (6E 2175)లో చోటు చేసుకుంది. ఇలా కొడుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారింది. ఈ గొడవకు పాల్పడిన వ్యక్తిని సాహిల్ కత్రియాగా గుర్తించారు పోలీసులు. ఈ వీడియోలో విమానం ఆలస్యానికి సంబంధించిన సమాచారం రావడం గమనించవచ్చు. అదే సమయంలో అసహనానికి గురైన ప్రయాణికుడు కో-పైలట్ అనూప్ కుమార్‌‎పై దాడికి పాల్పడ్డాడు. విమానంలో ఉన్న మహిళా ఎయిర్ హోస్టెర్స్‎లలో ఒకరు ఈ ఘర్షణ వాతావరణాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పైలట్ వెనక్కి తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆ ప్రయాణికుడిని విమానం నుంచి కిందకు దించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి అప్పగించింది. ఇండిగో ఫ్లైట్ కో-పైలట్ అనూప్ కుమార్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు నిందితులపై 323, 341, 290 ఐపీసీ సెక్షన్లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్‌లోని సెక్షన్ 22 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పైలట్‌ను ఓ ప్రయాణికుడు కొట్టిన వైరల్ వీడియోపై విచారణ చేపట్టారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా పెరిగిపోయింది. దీని కారణంగా పలు ప్రధాన పట్టణాల్లో స్థానికులు తీవ్రమైన చలితో అల్లాడుతున్నారు. ఈకారణంగానే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుంటే కొన్నింటిని రద్దు చేశారు అధికారులు. ఇప్పటి వరకూ 100 విమానాలు ఆలస్యంగా ప్రయాణించగా.. 10 విమానాలు రద్దైనట్లు వెల్లడించారు ఎయిర్ పోర్టు అధికారులు. ఈ ఘర్షణ వాతావరణంలో పలువురు ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. దీనిపై ఇండిగో సంస్థ స్పందిస్తూ అసౌకర్యానికి గురైన వారికి క్షమాపణలు కూడా తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..