ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత ఏం జరుగుతుంది? పోస్ట్‌ ఖాళీగా ఉంచుతారా? కొత్తవారిని ఎన్నుకుంటారా? చట్టం ఏం చెబుతోంది..?

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత జరిగే ప్రక్రియ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. రాష్ట్రపతి రాజీనామాను అంగీకరించిన తర్వాత పదవి ఖాళీ అవుతుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తాత్కాలిక బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరు నెలల లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది.

ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత ఏం జరుగుతుంది? పోస్ట్‌ ఖాళీగా ఉంచుతారా? కొత్తవారిని ఎన్నుకుంటారా? చట్టం ఏం చెబుతోంది..?
Jagdeep Dhankhar

Updated on: Jul 22, 2025 | 9:20 AM

ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ ఆకస్మిక రాజీనామా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆయన రాజీనామా తర్వాత ఎలాంటి ప్రక్రియ జరుగుతుందనే విషయం చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. మరి ఆసక్తికర విషయాలు, చట్ట బద్ధమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. రాజీనామా స్వీకరణ

ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతికి రాసి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ రాజీనామాను అంగీకరించిన వెంటనే అది అమలులోకి వస్తుంది.

2. పదవి ఖాళీగా ఉండటం

రాజీనామా ఆమోదం పొందిన తర్వాత, ఉపరాష్ట్రపతి పదవి అధికారికంగా ఖాళీ అవుతుంది.

3. తాత్కాలిక బాధ్యతలు

సాధారణంగా అయితే రాజ్యసభలో ఉపరాష్ట్రపతి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయన లేనపుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు.

4. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక..

రాజ్యాంగం ప్రకారం.. పదవి ఖాళీ అయిన ఆరు నెలల లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి (Article 68(1) ప్రకారం). ఎలెక్షన్ కమిషన్ ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాజ్యసభ, లోకసభ సభ్యులు ఓటు వేస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం.. ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లు పదవిలో ఉంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి