Kerala Assembly: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వీడీ సతీసన్.. ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం

Kerala Assembly: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా వీడీ సతీసన్ ను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరు ఆధారంగా ఈ ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Kerala Assembly: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వీడీ సతీసన్.. ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం
Kerla Assembly

Updated on: May 22, 2021 | 2:59 PM

Kerala Assembly: కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా వీడీ సతీసన్ ను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరు ఆధారంగా ఈ ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మునుపటి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రమేష్ చెన్నితలను ఈసారి ఈ పదవికి పక్కనపెట్టారు. ఈ విషయంపై కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముల్లాపల్లి రామచంద్రన్ మాట్లాడుతూ రమేష్ నాయకత్వం మీద హైకమాండ్ కు ఎటువంటి అపనమ్మకం లేదనీ, అయితే, మొన్నటి ఎన్నికల్లో దురదృష్టవశాత్తూ పార్టీ ఎదుర్కున్న పరాజయం కారణంగా కొత్త నాయకుడ్ని ఎంపిక చేశారని చెప్పారు. మార్పు ఉంటె బావుంటుంది అనే ఉద్దేశ్యంతోనే ఈ మార్పు జరిగిందన్నారు. నేను కూడా హైకమాండ్ ఎంపిక చేస్తేనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీ పరాజయానికి నేను బాధ్యత వహిస్తున్నట్టు హైకమాండ్ కు చెప్పను. హైకమాండ్ భవిష్యత్ లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పారు.

ఇంతకు ముందు భారతీయ యువజన కాంగ్రెస్ ఏఐసీసీకి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో కేరళలో నాయకత్వాన్ని మార్చాలని కోరింది. ఈ ఉత్తరంలో యువజన కాంగ్రెస్ కు చెందిన 24 మంది సంతకం చేశారు. దీనిలో పీసీసీ అధ్యక్షుడు సహా ప్రతిపక్ష నాయకుడు, ఉపాధ్యక్షుడిని కూడా మార్చమని కోరారు.

రాష్ట్రంలో రెండు రోజుల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపధ్యంలో వెంటనే కాంగ్రెస్ శాసనసభలో తమ నాయకుడిని ప్రకటించింది.

Also Read: Bridegroom Beaten: పెళ్లిపీటల మీద వరుడి చెంప పగులకొట్టిన వధువు.. అవాక్కైన అతిథులు.. విషయం తెలిసిన చితకబాదారు..!

Covid Vaccination: దేశవ్యాప్తంగా టీకా టెన్షన్.. 40 రోజుల్లో సగానికి పడిపోయిన వ్యాక్సినేషన్.. ప్రజలందరికీ అందేదెప్పుడు..?