ప్రేమించి పెళ్లి చేసుకుని.. భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..! విచారణలో విస్తుపోయే వాస్తవం!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడి చిత్రమైన మరణం కేసును పోలీసులు ఛేదించారు. 32 ఏళ్ల అతుల్ కుమార్‌ను అతని భార్య దామిని, ఆమె ప్రియుడుతో కలిసి హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు. దామిని తో పాటు పాఠశాల వ్యాన్ డ్రైవర్ తుషార్, మరో ఇద్దరు పాములు పట్టేవారితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దామిని, తుషార్‌ సహా సోను, ఉదయ్ అనే ఇద్దరు పాములవాళ్లను అరెస్టు చేశారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని.. భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..! విచారణలో విస్తుపోయే వాస్తవం!
Woman Gets Husband Bitten By Snake

Updated on: Jul 18, 2026 | 5:23 PM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడి చిత్రమైన మరణం కేసును పోలీసులు ఛేదించారు. 32 ఏళ్ల అతుల్ కుమార్‌ను అతని భార్య దామిని, ఆమె ప్రియుడుతో కలిసి హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు. దామిని తో పాటు పాఠశాల వ్యాన్ డ్రైవర్ తుషార్, మరో ఇద్దరు పాములు పట్టేవారితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దామిని, తుషార్‌ సహా సోను, ఉదయ్ అనే ఇద్దరు పాములవాళ్లను అరెస్టు చేశారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, నిందితులు ముందుగా అతుల్ తాగిన పాలలో అధిక మోతాదులో నిద్రమాత్రలు కలిపారు. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత అతని దుప్పటిలో విషపూరితమైన పామును వదిలారు. పాము కాటు వేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన అనంతరం నిందితులు దీనిని సహజ ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.

శుక్రవారం (జూలై 17) ఉదయం అద్దె ఇంట్లో మంచంపై అతుల్ మృతదేహం కనిపించింది. భార్య దామిని, కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తొలుత తెల్లవారుజామున తాను కుమారుడితో మరో గదిలో నిద్రించానని, ఉదయం వచ్చేసరికి భర్త దుప్పటి కప్పుకుని ఉండగా స్పందించలేదని, దుప్పటి తొలగించగా పాము కనిపించిందని దామిని పోలీసులకు తెలిపింది. గ్రామస్థులు ఆ పామును ఒక పెట్టెలో బంధించారు.

అయితే కుటుంబ సభ్యులు దామినిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమె కాల్ డీటెయిల్స్‌ను పరిశీలించారు. దర్యాప్తులో పాఠశాల వ్యాన్ డ్రైవర్ తుషార్‌తో ఆమె తరచూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. విచారణలో తుషార్ నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతని వాంగ్మూలం ఆధారంగా మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేశారు.

మీరట్‌లోని హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు గత నాలుగేళ్లుగా “కిడ్స్ ప్లే స్కూల్” నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితులపై హత్యతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us