ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వింత కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్యకు దోమలు కుడుతున్నాయని పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. అతడి భార్య ప్రసవించి ఓ రోజు కూడా గడవలేదు. ఓవైపు నొప్పి.. మరోవైపు దోమల బెడద.. వెరసి ఆమె తీవ్ర ఇబ్బందికి గురవుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు ఆ జంట సమస్యకు పరిష్కారం కూడా చూపించారు.
చాంద్‌దౌసీ ప్రాంతానికి చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్య ఇటీవలే ఆసుపత్రిలో ప్రసవించింది. ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా దోమలతో నిండిపోయింది. ఆసుపత్రిలో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో అతని భార్య తీవ్ర ఇబ్బందికి గురైంది. భార్య పరిస్థితి చూసి కలత చెందిన అసద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆయుధంగా చేసుకున్నాడు. వెంటనే సోషల్ మీడియా ద్వారా పోలీసులకు కంఫ్లైంట్ చేశాడు. ‟నా భార్య తీవ్ర ఇబ్బందికి గురవుతోంది. ఓవైపు నొప్పులు మరోవైపు దోమల బెడద.. ఆమె బాధను చూడలేకపోతున్నాను. దయచేసి తమ సమస్యకు పరిష్కారం చూపించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.
‘माफिया से लेकर मच्छर तक का निदान’ –
नर्सिंग होम में अपने नवजात शिशु और प्रसूता पत्नी को मच्छरों से राहत देने के लिये एक व्यक्ति द्वारा ट्वीट कर मदद की अपील की गयी। #UP112 PRV 3955 ने त्वरित कार्यवाही कर नर्सिंग होम में मॉस्किटो क्वॉइल पहुँचाया।#UPPCares@sambhalpolice pic.twitter.com/WTrK7o8bhY
— UP POLICE (@Uppolice) March 20, 2023
ఇది చూసిన పోలీసులు ఏమనుకున్నారో గానీ నిమిషాల వ్యవధిలో రంగంలోకి దిగారు. వెంటనే సమీపంలోని షాపుకెళ్లి మస్కిటో కాయిల్‌తో ఆసుపత్రికి వచ్చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడటంతోనే వారు ఆసుపత్రికి మస్కిటో కాయిల్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక నిమిషాల వ్యవధిలో తన సమస్యను పరిష్కరించిన పోలీసులకు అసద్ ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.