AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పడకగదిలో ప్రియుడితో కనిపించిన భార్యను నిలదీసిన భర్త.. ట్విస్ట్ ఇచ్చిన భార్య..!

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన, వెన్నులో వణుకు పుట్టించే సంఘటన వెలుగులోకి వచ్చింది. కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక యువకుడు, తన భార్య - ఆమె ప్రియుడు తనపై ప్రాణాంతక దాడి చేశారని ఆరోపించాడు. తన భార్యను ఆమె ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు, వారు దారుణంగా కొట్టి, వేడి నూనె పోయడంతో అతని కాలు తీవ్రంగా కాలిపోయింది. అయితే భర్తే తనపై దాడికి పాల్పడ్డాడని భార్య ఎదురు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పడకగదిలో ప్రియుడితో కనిపించిన భార్యను నిలదీసిన భర్త.. ట్విస్ట్ ఇచ్చిన భార్య..!
Attack With Boiling Oil
Balaraju Goud
|

Updated on: Jun 30, 2026 | 12:06 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన, వెన్నులో వణుకు పుట్టించే సంఘటన వెలుగులోకి వచ్చింది. కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక యువకుడు, తన భార్య – ఆమె ప్రియుడు తనపై ప్రాణాంతక దాడి చేశారని ఆరోపించాడు. తన భార్యను ఆమె ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు, వారు దారుణంగా కొట్టి, వేడి నూనె పోయడంతో అతని కాలు తీవ్రంగా కాలిపోయింది. అయితే భర్తే తనపై దాడికి పాల్పడ్డాడని భార్య ఎదురు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

బకానియా గ్రామానికి చెందిన బాధితుడు సిబిగంజ్‌లో ఉంటూ కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. తన భార్యకు బిథ్రి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరూ నిరంతరం ఫోన్లు, సోషల్ మీడియా రీల్స్ ద్వారా టచ్‌లో ఉండేవారని అతను ఆరోపించాడు. ఒకరోజు ఫ్యాక్టరీ నుంచి గదికి వచ్చిన భర్తకు, భార్య తన ప్రియుడితో కలిసి పడకగదిలో కనిపించింది. దీనిని అతను నిలదీయడంతో వివాదం మొదలైంది. భార్య, ఆమె ప్రియుడు కలిసి తనను దారుణంగా కొట్టి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారని, అంతటితో ఆగక వంటగదిలోని మరుగుతున్న నూనెను తెచ్చి తన కాలిపై పోశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

తీవ్ర గాయాలపాలైన బాధితుడు ప్రాణాలు దక్కించుకుని స్వగ్రామానికి చేరుకున్నాడు. న్యాయం కోసం షాహి, సిబిగంజ్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పోలీసులు సరైన విచారణ జరపకుండా కాలయాపన చేశారని బాధితుడు ఆరోపించాడు. దీంతో విసిగిపోయిన అతను చివరకు బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్యను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించాడు. “ఈ కేసు కేవలం ఏకపక్షం కాదు. భర్త ఫిర్యాదు చేయడానికి ముందే, భార్య తన భర్తపై అనుమానంతో దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.” అనిబరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు.

ప్రస్తుతం ఇరుపక్షాల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బాధితుడి కాలికి కాలిన గాయాలు నిజమే అయినప్పటికీ, అసలు తప్పు ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండు వైపుల ఆరోపణలను పరిశీలిస్తున్నామని, ఫోరెన్సిక్ మరియు వైద్య నివేదికల ఆధారంగా పూర్తి నిష్పాక్షికంగా విచారణ జరిపి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ స్పష్టం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత