భార్యను చంపిన కేసులో 10 ఏళ్లు జైలుకెళ్లి వచ్చి.. ఇప్పుడు తమ్ముడి భార్యను కొట్టి చంపి ఆత్మహత్య!

షాద్‌నగర్ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం కలకలం రేపింది. మీర్జాపూర్ జిల్లా లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెండూహాని బెల్హా గ్రామంలో ఒక కిరాతకుడు తన తమ్ముడి భార్యను దారుణంగా కొట్టి చంపి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలు నుండి ఇటీవలే విడుదలైన వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

భార్యను చంపిన కేసులో 10 ఏళ్లు జైలుకెళ్లి వచ్చి.. ఇప్పుడు తమ్ముడి భార్యను కొట్టి చంపి ఆత్మహత్య!
Mirzapur Crime

Updated on: Jul 13, 2026 | 3:51 PM

షాద్‌నగర్ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం కలకలం రేపింది. మీర్జాపూర్ జిల్లా లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెండూహాని బెల్హా గ్రామంలో ఒక కిరాతకుడు తన తమ్ముడి భార్యను దారుణంగా కొట్టి చంపి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలు నుండి ఇటీవలే విడుదలైన వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టెందుహాని బెల్హా గ్రామానికి చెందిన నంకు భార్య సంగీత (26) ఆదివారం (జూలై 12) సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఆమెకు, బావ అయిన చోటేలాల్ అలియాస్ కలత్తర్‌కు మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వాదం జజరిగింది. ఈ గొడవ కాస్తా ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన చోటేలాల్.. సంగీతపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

తమ్ముడి భార్య మరణించిందని గ్రహించిన నిందితుడు చోటేలాల్.. పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇంటికి కొంత దూరంలో ఉన్న ఒక తోటలోకి వెళ్లి, అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో లాల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్-ఇన్-ఛార్జ్ వేద్ ప్రకాష్ పాండే తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతురాలి సోదరుడు సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు చోటేలాల్ గతంలో తన సొంత భార్యను వరకట్నం కోసం హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు. ఆ కేసులో సుమారు 10 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించి, ఇటీవల విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మృతురాలు సంగీతకు ఐదేళ్ల కుమారుడు లాడో, ఐదు నెలల పసికందు పారో ఉన్నారు. తల్లి మరణించగా, తండ్రి తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయాడు. పసిపిల్లలు ఇద్దరూ అనాథలుగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ఘటనపై లాల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us