రైల్లో ఓ ప్రయాణికురాలి వద్ద మొబైల్ ఫోన్ దొంగిలించాడని తోటి ప్రయాణికులు శుక్రవారం (డిసెంబర్ 16) రాత్రి యువకుణ్ని కదులుతున్న రైల్లోంచి తోసేశారు. అతని తల స్తంభాన్ని బలంగా ఢీకొని మరణించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ తిల్హార్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసుల సమాచారం ప్రకారం..
అయోధ్య కంటోన్మెంట్ ఓల్డ్ దిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన ఫోన్ కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. అదే రైల్లో ఉన్న యువకుడి (20) వద్ద ఫోను గుర్తించిన తోటి ప్రయాణికులు అతనిపై దాడి చేశారు. చుట్టు ఉన్న ఇతర ప్రయాణికులు ఈ దృష్యాన్ని వీడియో తీశారు. క్షమించమని ప్రాధేయపడినా వినకుండా సదరు వ్యక్తిని కొడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆరగంటపాటు అతన్ని కొట్టి, ఆపై ఓ వ్యక్తి అతన్ని రైల్లో నుంచి బయటకు తోసేశాడు. దీంతో అతని తల ఓ స్తంభాన్ని ఢీకొని చనిపోయాడు. 66 సెకన్ల నిడివితో ఉన్న వీడియో శనివారం పోలీసులకు చిక్కడంతో విషయం వెలుగులోకొచ్చింది. రైల్వే ట్రాక్‌పై పడివున్న వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#शर्मनाक…..?
ट्रेन में मोबाइल चोरी के आरोप में यात्रियों नें युवक की जमकर की पिटाई। पिटाई के बाद शाहजहापुर के तिलहर के पास चलती ट्रेन से युवक को फेंका, युवक की हुई मौत। अयोध्या-दिल्ली एक्सप्रेस की जनरल बोगी का है मामला। बरेली जंक्शन जीआरपी ने आरोपी को किया गिरफ्तार। pic.twitter.com/6WLdCfKsoR— NCIB Headquarters (@NCIBHQ) December 19, 2022
ఈ ఘటనలో మృతుడి తలకు బలమైన గాయంతలగలడమేకాకుండా, ఒకకాలు తెగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుణ్ని గుర్తించి అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. వీడియోలో ఉన్న ఇతర నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఐతే మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని, అతని ఫొటోలను సమీప ప్రాంతాలకు పంపినట్లు మీడియాకు తెలిపారు.
మరిన్ని క్రై వార్తల కోసం క్లిక్ చేయండి.