స్నేహితుడిని తుపాకీతో కాల్చిన యువకుడు.. అసలు మ్యాటర్ తెలిసి పోలీసుల షాక్!

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ ఫరీదాబాద్ లో బుధవారం (ఆగస్టు 27) తెల్లవారుజామున స్నేహితుడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. స్నేహితుడు తన భార్యను మనాలీ టూర్‌కు తీసుకెళ్లాడని తెలుసుకున్న ఆ వ్యక్తి తన స్నేహితుడిని కాల్చి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

స్నేహితుడిని తుపాకీతో కాల్చిన యువకుడు.. అసలు మ్యాటర్ తెలిసి పోలీసుల షాక్!
Crime News

Updated on: Aug 28, 2025 | 5:13 PM

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ ఫరీదాబాద్ లో బుధవారం (ఆగస్టు 27) తెల్లవారుజామున స్నేహితుడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. స్నేహితుడు తన భార్యను మనాలీ టూర్‌కు తీసుకెళ్లాడని తెలుసుకున్న ఆ వ్యక్తి తన స్నేహితుడిని కాల్చి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఫరీదాబాద్‌లోని సెక్టార్ 10లో నివసిస్తున్న సురేష్ కుమార్ (45) మద్యం వ్యాపారి. నగరంలో పలు అవుట్ లెట్లు, స్పా సెంటర్లు, సెలూన్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫరీదాబాద్‌లోని బల్లాబ్ గఢ్ లోని జున్హేరాకు చెందిన వినోద్ కౌశిక్ (30) సెక్టార్ 2లో రెస్టారెంట్, కేఫ్ నిర్వహిస్తున్నాడు. సురేష్ కుమార్ తన బాడీగార్డు సోను కుమార్, అతని భార్య దురేష్, వినోద్ కౌశిక్ భార్య మేఘతో కలిసి నాలుగు రోజుల పాటు మనాలీకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

సురేశ్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి 1.30 గంటల మధ్య సెక్టార్ 70లోని కేజేఎల్ సొసైటీకి వచ్చాడు. సొసైటీ ప్రవేశ ద్వారం వద్ద సురేష్ దిగిపోయేసరికి వినోద్, అతని అనుచరుడు కారులో వేచి ఉన్నారు. సోనూ తదితరులు లగేజీని అన్ లోడ్ చేస్తుండగా వినోద్ తన కారులో కూర్చున్న సురేశ్ వద్దకు వచ్చి సమీపం నుంచి కాల్పులు జరిపాడని ఫరీదాబాద్ పోలీసు ప్రజాసంబంధాల అధికారి యశ్ పాల్ యాదవ్ తెలిపారు.

సురేష్ మెడ, ఛాతీ, పొత్తికడుపు భాగంలో గాయాలయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు సోనూ ప్రయత్నించగా సోనూపై దాడి చేసి తిరిగి కారులో ఎక్కి పరారయ్యాడు. నిందితుడిని ఇంకా పట్టుకోలేదని, సురేష్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

వినోద్, మేఘా ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు విచారణలో తేలింది. సెక్టార్ 9లోని సురేష్ సెలూన్ లో మేనేజర్ గా పనిచేస్తోంది. ఆమె కొన్నిసార్లు సురేష్ తో కలిసి బయటకు వెళ్లేదని, దీనికి వినోద్ వ్యతిరేకించాడని తెలిపారు. ఈ విషయం వారి మధ్య గొడవలకు కూడా దారితీసింది. అయితే, భర్తతో గొడవల నేపథ్యంలో వినోద్ భార్య మేఘా కేజేఎల్ సొసైటీలో సోనూ కుటుంబంతో కలిసి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈసారి మనాలి ట్రిప్ లో సురేష్ తో కలిసి వెళ్లడంతో ఆగ్రహించిన వినోద్ అతడిపై కాల్పులు జరిపాడు. బుధవారం బిపిటిపి పోలీస్ స్టేషన్ లో వినోద్ తోపాటు ఇతర గుర్తుతెలియని అనుమానితులపై హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..