Crime News: ‘నన్ను చంపేస్తే.. బతికొచ్చి తాంత్రిక శక్తులతో నీ భవిష్యత్‌ మార్చేస్తా..!’

తనని చంపేస్తే.. తిరిగి బతికొచ్చి తనకున్న తాంత్రిక శక్తులతో స్నేహితుడి భవిష్యత్తును మారుస్తానని చెప్పాడు ఓ వ్యక్తి. అతని మాటలు విన్న మరో వ్యక్తి స్నేహితుడిని చంపి కటకటాల పాలయ్యాడు. ఈ హత్యా ఉదంతం..

Crime News: నన్ను చంపేస్తే.. బతికొచ్చి తాంత్రిక శక్తులతో నీ భవిష్యత్‌ మార్చేస్తా..!
Uttar Pradesh Crime News

Updated on: Dec 18, 2022 | 8:13 AM

తనని చంపేస్తే.. తిరిగి బతికొచ్చి తనకున్న తాంత్రిక శక్తులతో స్నేహితుడి భవిష్యత్తును మారుస్తానని చెప్పాడు ఓ వ్యక్తి. అతని మాటలు విన్న మరో వ్యక్తి స్నేహితుడిని చంపి కటకటాల పాలయ్యాడు. ఈ హత్యా ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నితీశ్‌ సైనీ నిరుద్యోగం కారణంగా తన భవిష్యత్తు గురించి తరచూ ఆందోళన చెందేవాడు. 6 నెలల క్రితం హరిద్వార్‌లోని హర్‌ కీ పౌఢీకి నితీశ్‌ వెళ్లాడు. అక్కడ ఆశిష్‌ దీక్షిత్‌ అనే వ్యక్తి నితీస్‌కు పరిచయమయ్యాడు. దీంతో నితీస్‌ తన కష్టాలన్నింటినీ ఆశిష్‌తో చెప్పుకున్నాడు. అంతావిన్న ఆశిష్‌ తనకు తాంత్రిక శక్తులున్నాయని, వాటితో నీ కష్టాలన్నీ తీరుస్తానని నితీస్‌ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో స్నేహితుడైన నితీస్‌ అతన్ని పూర్తిగా నమ్మాడు. ఆ తర్వాత డిసెంబర్‌ 8న వీరిద్దరు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని, అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశిష్‌.. ‘నన్ను చంపు. నేను తిరిగి బతికి వచ్చి, తాంత్రిక శక్తులతో అద్భుతాలు సృష్టిస్తాను’ అని నితీస్‌ను కోరాడు. అతని మాటలు నమ్మిన నితీస్‌ అతన్ని హత్య చేశాడు. దీంతో ఆశిష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, నితీశ్‌ను అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us