హోటల్ రూమ్ ఇవ్వనందుకు అరాచకం.. మేనేజర్ సహా సిబ్బందిపై దాడి.. విచక్షణారహితంగా..

|

Feb 05, 2023 | 11:33 AM

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. హోటల్‌ యజమానితో పాటు సిబ్బందిపై అటాక్‌ చేశారు. హోటల్‌లో రూమ్‌ ఇవ్వలేదన్న కారణంతో లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా దాడి చేశారు.

హోటల్ రూమ్ ఇవ్వనందుకు అరాచకం.. మేనేజర్ సహా సిబ్బందిపై దాడి.. విచక్షణారహితంగా..
Up Crime News
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. హోటల్‌ యజమానితో పాటు సిబ్బందిపై అటాక్‌ చేశారు. హోటల్‌లో రూమ్‌ ఇవ్వలేదన్న కారణంతో లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా దాడి చేశారు. కాలితో తంతు అరాచకం సృష్టించారు. మద్యం బాటిళ్లతో హోటల్‌ రిసెప్షన్‌ దగ్గరకు వచ్చిన ఓ గ్యాంగ్‌.. రూమ్‌ కావాలని అడిగింది. అయితే, రూమ్స్‌ ఖాళీగా లేవని సిబ్బంది చెప్పారు. దీంతో తమకు కచ్చితంగా రూమ్ కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. మేనేజర్ రూమ్‌లు లేవని మరోసారి స్పష్టంచేయడంతో.. జీర్ణించుకోలేని వారు దాడికి దిగారు. కాలితో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ మేనేజర్ సహా, సిబ్బందిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు హోటల్‌ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

ఓనర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెబుతున్నారు బిజ్నూర్ ఎస్పీ ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు.

మేనేజర్ వారికి గది ఇవ్వడానికి నిరాకరించడంతో దాడికి దిగినట్లు ఎస్పీ ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..