పెళ్లి చేసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగం.. కొత్త జంటలకు సర్కార్‌ సరికొత్త ఆఫర్‌!

|

Dec 15, 2022 | 1:15 PM

పెళ్లి చేసుకుంటే ఉద్యోగం ఇస్తానంటోంది ఈ రాష్ట్ర సర్కార్‌! విచిత్రంగా వినిపించినా నిజమండీ.. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా పెళ్లయిన జంటలకు వారి అర్హతలను బట్టి ఆ రాష్ట్రప్రభుత్వం..

పెళ్లి చేసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగం.. కొత్త జంటలకు సర్కార్‌ సరికొత్త ఆఫర్‌!
newly married couples
Follow us on

పెళ్లి చేసుకుంటే ఉద్యోగం ఇస్తానంటోంది ఈ రాష్ట్ర సర్కార్‌! విచిత్రంగా వినిపించినా నిజమండీ.. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా పెళ్లయిన జంటలకు వారి అర్హతలను బట్టి ఆ రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుందని యూపీ రవాణా శాఖ సహాయ మంత్రి దయాశంకర్ సింగ్ తెలిపారు. బన్స్‌డిహ్‌ జిల్లాలో ‘మాస్‌ మ్యారేజ్‌ స్కీం’ కింద బుధవారం (డిసెంబర్‌ 14) జరిగిన సామూహిక వివాహ వేడుకలో మంత్రి పాల్గొని ఈ మేరకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..

‘పేద కుటుంబాలకు చెందిన యువతీ యువకుల వివాహాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ‘మాస్ మ్యారేజ్‌ స్కీం’ కింద జరుగుతున్నాయి. ఈ పథకం కింద కొత్తగా పెళ్లయిన జంటలకు వారి అర్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని వివిధ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతూ ప్రగతి పథంలో పయనిస్తున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ కులాలకు చెందిన 506 జంటలు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలకు మంత్రి బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.

మంత్రి ప్రకటనతో రానున్న రోజుల్లో ఈ పథకం కింద పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ‘మాస్ మ్యారేజ్‌ స్కీంలో చేరిన వారికి మాత్రమే పెళ్లి చేసి, జాబ్ ఆఫర్‌ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.