గర్ల్‌ఫ్రెండ్ పిలిచిందని వెళ్తే.. మూత్రం తాగించారు.. ఇంకా అత్యంత దారుణంగా..!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రియుడు తన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు.. అక్కడ ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడిని దారుణంగా కొట్టారు. ఆ యువకుడి బట్టలను తీసివేసి, అతనిపై మరిగే వేడి నీటిని పోసి, మూత్రం తాగించి, తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గర్ల్‌ఫ్రెండ్ పిలిచిందని వెళ్తే..  మూత్రం తాగించారు.. ఇంకా అత్యంత దారుణంగా..!
Brutally Beaten Up In Hardoi

Updated on: May 21, 2025 | 4:23 PM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని రహస్యంగా కలవడానికి వచ్చిన ప్రియుడిని, ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. దెబ్బలు తాళలేక ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. అనంతరం అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ తన స్నేహితురాలి కుటుంబ సభ్యులు తనను కొడుతూ మూత్రం తాగించారని చెప్పాడు. దీని తరువాత అతని ప్రైవేట్ భాగాలను కూడా గాయపర్చారని తెలిపాడు. ప్రియురాలి కుటుంబ సభ్యులు తనను కట్టేసి దారుణంగా కొట్టారని బాధిత ప్రియుడు ఆరోపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రియురాలి కుటుంబ సభ్యుల చెర నుండి ప్రేమికుడిని రక్షించారు. ప్రస్తుత ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

హర్దోయ్‌ జిల్లాలోని సీతాపూర్‌లోని మహోలి నివాసి అయిన బాధితుడు అతుల్ కశ్యప్, లోనార్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అదే కులానికి చెందిన అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే హర్దోయ్‌లోని లోనార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలోని తన ఇంటికి తనను కలవాలని స్నేహితురాలు అతనికి ఫోన్ చేసింది. ఇంతలో, తన ప్రియురాలిని కలవడానికి రహస్యంగా వచ్చిన ప్రియుడు అతుల్ కశ్యప్‌ను ప్రియురాలి కుటుంబం పట్టుకుని బంధించారు.

అతని బట్టలన్నీ విప్పేసి, దారుణంగా కొట్టారు. తీవ్రంగా కొడుతూ.. అతని శరీరంపై మరిగే వేడి నీటిని పోసి అతని ప్రైవేట్ భాగాలను గాయపరిచారు. తనను వదిలేయమని వేడుకున్నా.. వారు ఏమాత్రం కనికరించలేదని ఆ యువకుడు చెప్పాడు. వాళ్ళు అతనితో చాలాసార్లు మూత్రం కూడా తాగించారు. గంటల తరబడి చితకబాదడంతో అతుల్ స్పృహ కోల్పోయాడు. దీని తరువాత, గ్రామస్తులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని రక్షించారు.

తీవ్రంగా గాయపడ్డ అతుల్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. అతుల్ శరీరమంతా గాయాల గుర్తులు ఉన్నాయి. దెబ్బల వల్ల శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రహస్యంగా కలవడానికి వెళ్లిన ప్రేమికుడిని కొట్టిన కేసు వెలుగులోకి వచ్చిందని హార్దోయ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్తాండ్ సింగ్ తెలిపారు. దెబ్బలలో గాయపడిన ప్రేమికుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..