అయోధ్య ఏడీఎం సుర్జీత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి.. రక్తపు మడుగులో మృతదేహం లభ్యం..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఏడీఎం లా అండ్ ఆర్డర్ సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయోధ్య ఏడీఎం సుర్జీత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి.. రక్తపు మడుగులో మృతదేహం లభ్యం..!
Adm Surjeet Singh
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 24, 2024 | 3:01 PM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ఇక్కడ ఏడీఎం లా అండ్ ఆర్డర్ సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన గదిలో శవమై కనిపించాడు. ఈ ఘటన సూరాసారి కాలనీ సివిల్‌లైన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ADM మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. డివిజనల్ కమీషనర్, డిఎం, జిల్లా పాలనా యంత్రాంగంలోని అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఏడీఎం సుర్జీత్ సింగ్ కొత్వాలి నగర్‌లోని సురాసారి కాలనీలోని సివిల్ లైన్స్‌లో నివసించేవారు. అతని ఇంట్లోని ఓ గది నేలపై ఎక్కడ చూసినా రక్తం పడి ఉంది. అయితే పోలీసులు మాత్రం వివరాలు చెప్పేందుకు సిద్ధంగా లేరు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన గురువారం(అక్టోబర్ 24) ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, ADM మొత్తం కుటుంబం కాన్పూర్‌లో నివసిస్తోంది. అతను ఇక్కడ వంట చేసేందుకు పనిమనిషిని నియమించుకున్నాడు. రోజూలాగే గురువారం ఉదయం కూడా పనిమనిషి ఆహారం వండడానికి వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని చూసి కేకలు వేయడం ప్రారంభించింది. గదిలో ఏడీఎం మృతదేహం పడి ఉండడం చూశారు. దీంతో పనిమనిషి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఎంపీ అవధేష్ ప్రసాద్ సురాసరి కాలనీకి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ- ఈ ఘటన చాలా బాధాకరం. సుర్జిత్ మంచి అధికారి. అతను ప్రజలలో కూడా ప్రజాదరణ పొందాడని కొనియాడారు. అతని మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..