BBC IT Survey: ఎలాంటి నిర్ణయం తీసుకోలేం.. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై తేల్చేసిన అమెరికా..

|

Feb 15, 2023 | 9:34 AM

ఇవి సోదాలు కావని, సర్వే మాత్రమేనని తెలిపారు ఐటీ అధికారులు. పన్ను అవకతవకలు, ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌, సబ్సిడరీల ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌లో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సర్వే చేస్తున్నట్టు వెల్లడించారు.

BBC IT Survey: ఎలాంటి నిర్ణయం తీసుకోలేం.. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై తేల్చేసిన అమెరికా..
BBC
Follow us on

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై BBC ఆఫీసుల్లో నిన్న ఉదయం ప్రారంభమైన దాడులు..ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి. సిబ్బంది ఫోన్లు, లాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. BBC ఇండియా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్నారు. అయితే ఇవి సోదాలు కావని, సర్వే మాత్రమేనని తెలిపారు ఐటీ అధికారులు. పన్ను అవకతవకలు, ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌, సబ్సిడరీల ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌లో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సర్వే చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ నేపథ్యంలో BBCపై ఐటీ దాడులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

అయితే, ఆదాయపు పన్ను శాఖ జరిపిన సర్వే గురించి తమకు తెలుసునని.. అయితే తాము ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో తాము లేమని అమెరికా పేర్కొంది. ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు ‘ సర్వే’ విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా పత్రికా ప్రాముఖ్యతను అమెరికా సమర్థిస్తుందని ఆయన అన్నారు. ప్రైస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలను బలోపేతం చేయడానికి దోహదపడే మానవ హక్కులుగా భావ ప్రకటనా స్వేచ్ఛ, మతం లేదా విశ్వాసం అవసరాన్ని US హైలైట్ చేస్తూనే ఉందన్నారు.

ఇదిలావుంటే, సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం మానుకోవాలని తన సిబ్బందిని కోరింది బీబీసీ. సెర్చ్ ప్రారంభమైన 6 గంటల తర్వాత ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను స్కాన్ చేసిన తర్వాతే వెళ్లేందుకు అనుమతించారు. ఉద్యోగుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

BBC కార్యాలయాల్లో IT సర్వేలను ఖండించింది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా. మరోవైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో ఆదాయపన్ను శాఖ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుందని, సర్వే పూర్తయ్యాక సమాచారం ఇస్తుందన్నారు. IT సర్వే పూర్తయిన తర్వాతే ఆ సమాచారాన్ని మీడియాకు అందిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం