US Intelligence Report: యుద్ధం జరుగదు కానీ.. భారత్-పాక్ సంబంధాలపై కీలక విషయాలు వెల్లడించిన అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్..

|

Apr 14, 2021 | 12:00 PM

US Intelligence Report: భారతదేశం - పాకిస్తాన్ మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే అణు ఆయుధ సామర్థ్యం..

US Intelligence Report: యుద్ధం జరుగదు కానీ.. భారత్-పాక్ సంబంధాలపై కీలక విషయాలు వెల్లడించిన అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్..
India Vs Pakistan
Follow us on

US Intelligence Report: భారతదేశం – పాకిస్తాన్ మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే అణు ఆయుధ సామర్థ్యం కలిగిన భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు లేవంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై యూఎస్ ఆఫీస్ ఆఫ్‌ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్(ODNI) వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈసారి పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తమ సైనిక శక్తితో ధీటైన సమాధానం చెప్పే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది.

‘‘భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేనప్పటికీ.. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉంది. భారత్ మునుపటి కంటే బలమైన దేశంగా ఎదిగింది. గతం కంటే మెరుగైన సైనిక శక్తిని కలిగిన భారత్‌తో పాకిస్తాన్‌ కయ్యానికి కాలు దువ్వితే పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది. అణ్వాయుధ సంపత్తి కలిగి భారత్, పాకిస్తాన్‌ పరస్పరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. కశ్మీర్‌ వివాదం నేపథ్యంలో భారత్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు చాలా ఉన్నాయి.’ అని డీఎన్ఐ పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, 35 ఏను భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్టికల్స్‌ను రద్దు చేసి.. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ చర్యతో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత బలహీన పడ్డాయి. చివరికి ఇరు దేశాలు తమ తమ హై కమిషనర్లను వెనక్కి పిలిచాయి. అయితే, ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించేందుకు భారత్ ముందడుగు వేసింది. అయితే, హింసాత్మక విధానాలను విడనాడిన తరువాతే సత్సంబంధాలపై చర్చలు ఉంటాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పైనే ఉందని భారత్ తేల్చి చెప్పింది.

కాగా, భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు నాలుగు యుద్ధాలు జరిగాయి. ఇక పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్‌లో జరిపిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా 2016లో సర్టికల్ స్ట్రైక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే.. 2019లో బాలాకోట్‌పై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ రెండు చర్యలతో భారత్ ‌జోలికొస్తే ఊరుకునేది లేదని ఇండియన్ గవర్న్‌మెంట్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో భారత్‌‌ను పాకిస్తాన్ కవ్వి్స్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డీఎన్ఐ హెచ్చరించింది. అమెరికాకు చెందిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్(డీఎన్ఐ) ఆదేశ అధ్యక్షుడికి ఇంటెలిజెన్స్ అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తుంది. అలాగే ఈ డీఎన్ఐ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

Also read:

Karthika Deepam: దీపని ట్రీట్మెంట్ కోసం ఒప్పించే ప్రయత్నంలో డాక్టర్ బాబు.. కార్తీక్ ని కలవడానికి బయలుదేరిన మోనిత

కరోనా వైరస్ శవ జాగారం..కరోనా మరణాలతో రద్దీగా మార్చురీలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి!: covid19 Live Video.

NEET PG 2021: నీట్‌ పీజీ పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల.. ఇలా సులువుగా డౌన్‌లౌడ్‌ చేసుకోండి..