
అమెరికాలో ఉద్యోగం సంపాదించడం ఒక విజయం. అక్కడే శాశ్వతంగా స్థిరపడటం మరో లక్ష్యం. హెచ్-1బీ వీసాతో వెళ్లే భారతీయ ఐటీ నిపుణులకు ఇప్పుడు ఈ రెండింటి మధ్య అంతరం పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వలస విధాన నిర్ణయాలు, గ్రీన్‌కార్డు ప్రక్రియలో ఎదురవుతున్న అడ్డంకులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఎనిమిది కంపెనీలపై పర్మ్ ప్రక్రియకు సంబంధించిన ఆంక్షలు విధించడంతో ఈ చర్చ మరింత తీవ్రమైంది. అయితే ఇది హెచ్-1బీ వీసాలన్నింటినీ రద్దు చేశారని కాదు. కొన్ని సంస్థల్లో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అమెరికాలో భారతీయుల సంఖ్య ఎంత? అమెరికాలో భారత్‌లో జన్మించి నివసిస్తున్నవారు సుమారు 32 లక్షల మంది ఉన్నారు. అమెరికాలో భారతీయ మూలాలున్న మొత్తం జనాభా 52 లక్షలకు పైగా ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. వీరిలో ఐటీ నిపుణులు, వైద్యులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు 3.63 లక్షలకు చేరారు. అంటే అమెరికాపై భారతీయుల ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేం. అయితే ఉద్యోగ వీసాలు, శాశ్వత నివాసం విషయంలో అనిశ్చితి పెరుగుతోంది. హెచ్-1బీ వేరు.. గ్రీన్‌కార్డు వేరు హెచ్-1బీ వీసా అమెరికాలో నిర్దిష్ట ఉద్యోగం చేసేందుకు అనుమతిస్తుంది. గ్రీన్‌కార్డు...