యూపీ.. కాంగ్రెస్ నేతపై పోలీసు కేసు

వలస కూలీల అంశంపైనా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన అభ్యంతరకర ట్వీట్లు చేసిన కాంగ్రెస్ నేత పంకజ్ పునియాపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

యూపీ.. కాంగ్రెస్ నేతపై పోలీసు కేసు

Edited By:

Updated on: May 20, 2020 | 8:31 PM

వలస కూలీల అంశంపైనా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన అభ్యంతరకర ట్వీట్లు చేసిన కాంగ్రెస్ నేత పంకజ్ పునియాపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. హజ్రత్ గంజ్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. వలస జీవుల తరలింపు కోసం తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ వెయ్యి బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ యూపీ ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదని పునియా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన.. హిందూ, సంఘ్ పరివార్ పై అనుచిత ట్వీట్లు చేసినట్టు తెలిసింది. వలస కూలీల విషయంలో యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా పునియా ఆరోపించినట్టు తెలుస్తోంది. దీనితో ఘజియాబాద్ పోలీసు స్టేషన్ లో కూడా ఈయనపై కేసు నమోదైంది. ఏఐసీసీ సభ్యుడైన ఈయన.. ఢిల్లీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బస్సులను నోయిడా బోర్డర్ లో ఆపి వేశారని, ఇందుకు యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు.