రూ.10 వేలు ఇస్తేనే కాపాడేది..! గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి.. ఎక్కడంటే..

|

Sep 02, 2024 | 10:35 AM

అనుకోకుండా వరద ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్‌ కాశ్యప్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ, అందుకోసం డబ్బు డిమాండ్ చేశాడు. ఆన్‌లైన్‌లో రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు తాను బాధితుడిని కాపాడబోనని చెప్పాడు. సదరు అధికారి సింగ్‌ నదిలో కొట్టుకుపోతూ ఉంటే,

రూ.10 వేలు ఇస్తేనే కాపాడేది..! గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి.. ఎక్కడంటే..
UP official drowns in Ganga
Follow us on

కాపాడేందుకు 10వేలు డిమాండ్ చశాడు ఓ గజ ఈతగాడు.. ఇందుకు అంగీకరించిన బాధితుడు బంధువులు ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేశారు. కానీ, మనీ ట్రాన్స్‌ఫర్‌ అయ్యేందుకు సమయం పట్టింది. డబ్బులు ముడితేనే మనిషిని కాపాడేది అని ఆ గజ ఈతగాడు తేల్చి చెప్పాడు. ఇంతలోనే నదిలో పడ్డ వ్యక్తి వరద ఉధృతికి కనిపించకుండా కొట్టుకుపోయాడు. ఈ విషాద సంఘటన యూపీలో చోటు చేసుకుంది. మృతుడు ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సమాచారం మేరకు ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఆదిత్య వర్ధన్‌ సింగ్‌ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్‌లోని నానామావ్‌ ఘాట్‌ వద్ద గంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అనుకోకుండా వరద ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్‌ కాశ్యప్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ, అందుకోసం డబ్బు డిమాండ్ చేశాడు. ఆన్‌లైన్‌లో రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు తాను బాధితుడిని కాపాడబోనని చెప్పాడు. సదరు అధికారి సింగ్‌ నదిలో కొట్టుకుపోతూ ఉంటే, రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు సునీల్‌ వేచి చూశాడు. దీంతో ఆయన నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. గల్లంతైన సింగ్‌ కోసం డైవర్లు బోటులో వెతికారు. అయితే, మృతదేహం లభ్యం కాలేదని, గాలింపు కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..