Ayodhya Sunni Waqf Board: అక్కడ మసీదు, ఆసుపత్రి కూడా నిర్మిస్తాం.. సున్నీ వక్ఫ్ బోర్డు క్లారిటీ

|

Feb 25, 2020 | 6:38 PM

అయోధ్యలో తమకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మసీదుతో బాటు ఓ ఆసుపత్రి, లైబ్రరీని కూడా నిర్మిస్తామని యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది.

Ayodhya Sunni Waqf Board: అక్కడ మసీదు, ఆసుపత్రి కూడా నిర్మిస్తాం.. సున్నీ వక్ఫ్ బోర్డు క్లారిటీ
Follow us on

అయోధ్యలో తమకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మసీదుతో బాటు ఓ ఆసుపత్రి, లైబ్రరీని కూడా నిర్మిస్తామని యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అయోధ్య కేసుగా కొన్ని దశాబ్దాల పాటు నలిగిన ఈ వివాదాస్పద అంశంలో రామ మందిర నిర్మాణానికి 2.77 ఎకరాల స్థలాన్ని రామ్ లీలా ట్రస్టుకు, 5 ఎకరాలను సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని 2019 లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నిచ్చింది. అయితే ఈ ఐదెకరాలను నిరాకరించాలని ఈ బోర్డు మొదట నిర్ణయించింది.  కానీ ఆ తరువాత మెత్తబడి.. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తమ వైఖరి అదే అయితే కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అవుతుందని భావించామని, అందువల్ల ఈ స్థలంలో మసీదు, ఆసుపత్రి, లైబ్రరీని కూడా నిర్మించాలని నిర్ణయించామని బోర్డు చైర్మన్ జఫర్ ఫారూఖీ తెలిపారు. మసీదును ఎంత మేర ఏ స్థలంలో నిర్మించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. మసీదు నిర్మాణం,  డిజైన్ తదితర అంశాలపై తమ బోర్డు మళ్ళీ సమావేశమవుతుందని ఆయన చెప్పారు. తాము కోర్టు ధిక్కారానికి పాల్పడతామని ఎవరైనా ఎలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో.. ‘వివాదరహితంగా ‘ మారిన ఈ స్థలంలో అసలు బోర్డు మసీదు నిర్మిస్తుందా అన్నదానిపై సస్పెన్స్ వీడిపోయింది.