భార్యతో గొడవ.. మధ్యలో జోక్యం చేసుకోవడంతో తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు!

ఓ దుర్మార్గుడు మనిషన్న విషయమే మరిచిపోయాడు. మద్యం సేవించి నిత్యం తల్లి, భార్యను వేధించసాగాడు. మద్యం మత్తులో భార్యను కొడుతుంటే చూడలేక ఎంతో ఓర్పుతో కొడుకుకు సర్ది చెప్పే ప్రయత్నం చేయడమే పాపమైంది. తల్లి అని కూడా చూడకుండా ఆ కిరాతకుడు అత్యంత దారుణంగా ఆమెను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది..

భార్యతో గొడవ.. మధ్యలో జోక్యం చేసుకోవడంతో తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు!
Man Kills Mother

Updated on: Mar 07, 2025 | 5:18 PM

లక్నో, మార్చి 7: ఓ వ్యక్తి భార్యతో ఏదో విషయమై తీవ్రంగా గొడవపడుతున్నాడు. దీంతో చూస్తూ ఉండలేక అతడి తల్లి వారి మధ్యలోకి వెళ్లి సర్ది చెప్పేందుకు యత్నించింది. అదే ఆమె చేసిన అతిపెద్ద పాపం అయింది. ఒక్కసారిగా ఆగ్రహించిన కుమారుడు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తల్లిని పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని నిగోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపత్‌పూర్ గ్రామానికి చెందిన వినోద్‌ (25)కు ఇటీవల వివాహం జరిగింది. అయితే మద్యానికి బానిసైన వినోద్ తరచుగా భార్యతో గొడవపడేవాడు. గురువారం (మార్చి 6) సాయంత్రం మరోమారు మద్యం సేవించిన అతడు ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. వాగ్వాదం జరగడంతో అతడు భార్యను పట్టుకొని కొట్టసాగాడు.

గమనించిన వినోద్‌ తల్లి నైనా దేవి (60) భార్యాభర్తలకు సర్ది చెప్పేందుకు యత్నించింది. అయితే ఆగ్రహించిన వినోద్‌ ఈటెతో పొడిచి తల్లిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నైనా దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిని హత్య చేసిన నిందితుడు వినోద్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు వివరాలను పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రాజేష్ ఎస్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us