ఇండియా, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ విషయాన్ని టీమ్ఇండియా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి కొందరు ఆటగాళ్లను బాధ్యులను చేస్తూ ట్రోలింగ్ జరుగుతోంది. ఇక భారత్ వీరాభిమానుల వేదను వర్ణించ వీలులేనింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పుర్‌లో ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భార్యపై పోలీసులకు కంప్లైంట్ చేశాడో వ్యక్తి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల అక్టోబరు 24న ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ సమయంలో ఢిల్లీలో తన స్నేహితులతో కలిసి మ్యాచ్ చూసిన ఇషాన్ మియాన్ అనే వ్యక్తి మిగతా భారత అభిమానుల్లానే చాలా డిసప్పాయిండ్ అయ్యాడు. అదే సమయంలో తన వాట్సాప్ చూడగా.. అందులో పాక్ గెలుపును ఆనందిస్తున్నట్లు తన భార్య స్టేటస్ కనిపించింది.
దీంతో ఇషాన్ మియాన్ కోపంతో రగిలిపోయాడు. భార్య ప్రవర్తనను సహించలేక రామ్‌పుర్ ఎస్పీని కలిసి ఈ విషయంపై కంప్లైంట్ చేశాడు. తన భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. భారత్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రబియా స్టేటస్ ఆధారంగా పోలీసులు సెక్షన్ 153ఏ, 66 కింద కేసు ఫైల్ చేశారు. నిందితురాలిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని