AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prosenjit Chatterjee: స్విగ్గీలో ఆర్డర్‌ చేస్తే ఫుడ్‌ రాలేదు.. ప్రధాని మోడీకి, సీఎం మమతకు బెంగాల్‌ సూపర్‌స్టార్‌ లేఖ ..

దేశమంతా అధిక ధరలు , కరోనా సంక్షోభం. నిరుద్యోగం లాంటి సమస్యలతో తల్లడిల్లుతుంటే బెంగాల్‌ సూపర్‌స్టార్‌ ప్రసన్నజీత్‌ చట్టర్జీ బాధ మాత్ర వేరేవిధంగా ఉంది. ఆన్‌లైన్‌లో..

Prosenjit Chatterjee: స్విగ్గీలో ఆర్డర్‌ చేస్తే ఫుడ్‌ రాలేదు.. ప్రధాని మోడీకి, సీఎం మమతకు బెంగాల్‌ సూపర్‌స్టార్‌ లేఖ ..
Prosenjit Chatterjee
Sanjay Kasula
|

Updated on: Nov 06, 2021 | 10:03 PM

Share

Prosenjit Chatterjee: దేశమంతా అధిక ధరలు , కరోనా సంక్షోభం. నిరుద్యోగం లాంటి సమస్యలతో తల్లడిల్లుతుంటే బెంగాల్‌ సూపర్‌స్టార్‌ ప్రసన్నజీత్‌ చట్టర్జీ బాధ మాత్ర వేరేవిధంగా ఉంది. ఆన్‌లైన్‌లో తాను ఫుడ్‌ కోసం స్విగ్గీకి ఆర్డర్‌ చేశానని , కాని రాలేదని ఆయన ప్రధాని మోడీకి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాయడం సంచలనం రేపింది. తనకు న్యాయం చేయాలని ప్రధాని మోడీ , సీఎం మమతా బెనర్జీని లేఖలో కోరారు ప్రసన్నజీత్‌. ఆయన రాసిన లేఖపై సోషల్‌ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు జనం.

ఇది చాలా సీరియస్‌ విషయమని.. వెంటనే బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఓ నెటిజెన్‌ సెటైర్‌ విసిరారు. ఫుడ్‌ కోసం డెలివరీ యాప్స్‌పై ఆధారపడే తనలాంటి వాళ్లకు తీరని అన్యాయం జరిగిందని లేఖలో పేర్కొన్నారు ప్రసన్నజీత్‌.

కాకపోతే తన ఆర్డర్‌ను క్యాన్సల్‌ చేసిన స్విగ్గీ డబ్బులు వెనక్కి ఇచ్చినట్టు వివరణ ఇచ్చారు. ప్రసన్నజీత్‌ తన లేఖను ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పంపిస్తే బాగుంటుందని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు.

ఇది జాతీయ సమస్య అని ఒకరు , దోషులను కఠినంగా శిక్షించాలని మరొకరు ట్వీట్‌ చేశారు. కాని ఇలా ఓ సీనియర్‌ నటుడు అతిచిన్న విషయంపై ప్రధాని మోదీకి , మమతా బెనర్జీకి లేఖ రాయడం సంచలనం రేపింది. ఆయనకు బెంగాల్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎన్నో అవార్డులను కూడా గెల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్‌ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..