పోస్టుమార్టం సమయంలో లేచి కూర్చున్న బాలిక..! ఆశ్చర్యపోయిన డాక్టర్ పరిస్థితి..

| Edited By: Ravi Kiran

Jun 22, 2023 | 5:45 AM

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. కానీ, అక్కడ పోస్టుమార్టం చేయడానికి సిద్ధపడ్డ డాక్టర్ మాత్రం ఆమెను ఇంటికి తిరిగి పంపించాడు.. ఇది నిజంగానే జరిగింది. అవును... కాలువలో పడి ఓ బాలిక మృతి చెందింది. నీళ్లు మింగిన బాలిక చనిపోయింది..

పోస్టుమార్టం సమయంలో లేచి కూర్చున్న బాలిక..! ఆశ్చర్యపోయిన డాక్టర్ పరిస్థితి..
Mirzapur Hospital
Follow us on

ఒక్కోసారి కొన్ని వార్తలు మనల్ని షాక్‌కు గురిచేస్తాయి. అయితే కొన్ని వార్తలు మన కళ్లను చెవులను కూడా నమ్మలేనంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదిగో ఇక్కడ వైరల్‌ అవుతున్న వార్త కూడా ఇలాంటిదే. ఇక్కడ వైరల్‌ అవుతున్న వార్త సారాంశంలో… పోస్ట్‌మార్టం కోసం వెళ్లిన మృతదేహం తిరిగి లేచి కూర్చుంది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. కానీ, అక్కడ పోస్టుమార్టం చేయడానికి సిద్ధపడ్డ డాక్టర్ మాత్రం ఆమెను ఇంటికి తిరిగి పంపించాడు.. ఇది నిజంగానే జరిగింది. అవును… మీర్జాపూర్‌లో కాలువలో పడి ఓ బాలిక మృతి చెందింది. నీళ్లు మింగిన బాలిక చనిపోయిందని అందరూ భావించారు. పోలీసులు కూడా ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాలని పట్టుబట్టారు. పోలీసులు ఆమెను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోస్టుమార్టం సందర్భంగా బాలిక గుండె చప్పుడును పరిశీలించిన వైద్యులు ముందుగా నివ్వెరపోయారు. బాలిక గుండె కొట్టుకోవటం చప్పుడు గమనించారు. అంతలోనే ఆ అమ్మాయి కళ్లు కూడా తెరిచి చూసింది. దాంతో ఆ డాక్టర్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కానీ, బాలిక చనిపోలేదని తెలుసుకున్న వైద్యులు ఆమె అపస్మారక స్థితిలో ఉందని నిర్ధారించి వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించారు. పొట్టను నొక్కుతూ మింగిన నీటిని బయటకు తీసి చికిత్స చేయించారు.

అలా కొద్దిసేపటికే పూర్తి స్పృహలోకి వచ్చిన బాలిక మానసిక పరిస్థితిని కూడా డాక్టర్ పరిశీలించారు. తన పేరు, తండ్రి పేరు, ఊరు పేరు… అంటూ డాక్టర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని వైద్యుడికి నిరూపించుకుంది. మిర్జాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులనే కాకుండా తెలిసిన ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..