Mumbai Attack: 26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రధారిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా ఆమోదం

|

May 18, 2023 | 2:40 PM

2008లో నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన ఉగ్రమూకల భీకర దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దుర్ఘటనలో సుమారు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడుల్లో కీలక నిందితుల్లో ఒకడైన తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు ఆమోదం వచ్చింది.

Mumbai Attack: 26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రధారిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా ఆమోదం
Mumbai Attack
Follow us on

2008లో నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన ఉగ్రమూకల భీకర దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దుర్ఘటనలో సుమారు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడుల్లో కీలక నిందితుల్లో ఒకడైన తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు ఆమోదం వచ్చింది. ఎట్టకేలకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్డు తాజాగా ఈ తీర్పు వెల్లడించింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగూణంగా కోర్టు ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్‌‌లో పుట్టి కెనడ వ్యాపారవేత్తగా ఎదిగిన తహవూర్ రాణాకు 2008లో జరిగిన ముంబయి దాడులకు ఆర్థిక సహాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అయితే 26/11 ముంబయి దాడుల్లో తహవూర్ రాణా పాత్రపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే అతడిని అప్పగించాలని భారత్‌ కోరడంతో ప్రస్తుతం రాణా అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు అతనికి 14 ఏళ్లు జైలు శిక్ష కూడా విధించింది. అలాగే ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్‌ హెడ్లీకి తహవూర్‌ అత్యంత సన్నిహితుడు. ఈ దాడులకు ముందు కూడా ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా డేవిడ్ హెడ్లీ గతంలో చెప్పాడు. ఇదిలా ఉండగా జూన్‌ 22న ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ తీర్పు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం