Viral: బయట నుంచి చూస్తే మొక్కజొన్న చేనే.. లోపలికెళ్లి చూస్తే ఉంది అసలు సినిమా

ఇంటి పక్కనే చేను. మొక్కజొన్న వేస్తే ఏదో అరకొర ఆదాయం వస్తుంది. ఏ పండిస్తే బాగా సంపాదించొచ్చు అని ఆలోచించాడు. ఈ క్రమంలో అతడి మెదడులో ఓ తప్పుడు ఆలోచన పొడిచింది. దాన్ని అమలు చేశాడు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.

Viral: బయట నుంచి చూస్తే మొక్కజొన్న చేనే.. లోపలికెళ్లి చూస్తే ఉంది అసలు సినిమా
Maize (representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: May 18, 2023 | 3:14 PM

తప్పుడు పనులు చేయడంలో క్రియేటివిటీ వాడుతున్నారు కేటుగాళ్లు. పుష్ప రేంజ్‌లో తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతున్నారు. తమ ఇస్మార్ట్ బుర్రలతో పోలీసులకు, అధికారులకు సవాల్ విసురుతున్నారు. రెండు దమ్ములు లాగగానే కిక్కిచ్చే మత్తు పదార్థం గంజాయి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో విసృతంగా దొరకుతుంది. దీన్ని పీల్చుతూ.. కలల లోకంలో తెలియాడుతూ.. విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు కొందరు కుర్రాళ్లు. గంజాయి పెంపకం, వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. అధికారులు కేటుగాళ్లను కేసులు పెట్టి.. జైల్లో వేస్తున్నా.. తమ పద్దతి మార్చుకోవడం లేదు.

తాజాగా గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా షెహ్రా తాలూకా బోరియా గ్రామంలో మొక్కజొన్న తోట లోపల గంజాయి సాగు చేస్తున్న..  ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బస్ కండక్టర్ శంకర్ మావ్జీభాయ్ దోడియార్ తన ఇంటి సమీపంలో ఉన్న పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అది బయట అందర్నీ మభ్యపెట్టడానికే. లోపల సీక్రెట్‌ సాగు చేసేది పక్కా నాటు గంజాయి. ఈ సమాచారం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారులకు అందింది. దీంతో అకస్మాత్తుగా ఆ పొలంలో దాడులు చేశారు.

సోదాల్లో పొలంలో సాగు చేసిన దాదాపు 33 పచ్చి గంజాయి మొక్కల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి బరువు 54.72 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.5.47 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు.  (Source)

Ganja

Ganja

మరిన్ని జాతీయ వార్తల కోసం