Paddy Procurement: ఏ రాష్ట్రంలోనూ పారాబాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడం లేదు.. కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ స్పష్టం

|

Apr 11, 2022 | 8:41 PM

రైతుల నుంచి బియ్యం సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనవసరర్ధాంతం చేస్తోందని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే అన్నారు.

Paddy Procurement: ఏ రాష్ట్రంలోనూ పారాబాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడం లేదు.. కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ స్పష్టం
Sudhanshu Pandey
Follow us on

Paddy Procurement: రైతుల నుంచి బియ్యం సేకరణ విషయంలో తెలంగాణ(Telangana) ప్రభుత్వం అనవసరర్ధాంతం చేస్తోందని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే(Sudhanshu Pandey) అన్నారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌ నుంచి కేంద్రం ఎటువంటి పారాబాయిల్డ్‌ రైస్‌ సేకరించడం లేదని ఆయన స్పష్టం చేశారు. రా రైస్‌ మాత్రమే సేకరిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అన్నిరాష్ట్రాల్లోనూ కేంద్రం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. దేశమంతా ఒకేరకమైన పాలసీ అమల్లో ఉంది. ఎలాంటి వివక్షకు తావులేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల స్నేహపూర్వక వైఖరి అవలంబిస్తోందని సుధాంశు పాండే స్పష్టం చేశారు.

బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రంపైనా వివక్ష ఉండదన్నారు. ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే బియ్యం సేకరిస్తామని స్పష్టం చేశారు. బియ్యం సేకరణపై అన్ని రాష్ట్రాలను వివరాలు గతంలోనే కోరామన్నారు. అయితే, రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన బియ్యం ఇంకా ఉందనేది వాస్తవమని తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ ఏ రాష్ట్రంలోనూ పారాబాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడం లేదని చెప్పారు. పంజాబ్‌ నుంచి ఒక్క గింజకూడా బాయిల్డ్‌ రైస్‌ తీసుకోలేదని, అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరిస్తోందని వెల్లడించారు.

ఇప్పటి వరకు అత్యధికంగా తెలంగాణ నుంచి 48.8 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ తీసుకున్నామని సుధాంశు పాండే తెలిపారు. ఆ రాష్ట్రం విజ్ఞప్తి మేరకు మరో 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్‌ రైస్‌ సేకరించామన్నారు. ఎఫ్‌సీఐ వద్ద ఇప్పటికే 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ నిల్వ ఉంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల నుంచి బాయిల్డ్‌ సేకరణను తగ్గించామన్నారు. ధాన్యం సేకరణపై ఫిబ్రవరిలోనే ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రెండు సమావేశాలు నిర్వహించి, రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నాం. ధాన్యం విషయంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలే అవగాహన కల్పించాలి. ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేకరించడం సాధ్యం కాదు. ధాన్యం మిల్లింగ్‌ చేసినందుకు మిల్లర్లకు డబ్బు చెల్లిస్తున్నామని సుధాంశు పాంటే తెలిపారు.

Read Also…. నష్టాల్లో ఉన్న రైల్వే స్టేషన్‌ను దత్తత తీసుకుని లాభాల బాట పట్టించిన గ్రామస్థులు..