Kishan Reddy: పర్యావరణ దినోత్సవ వేళ పదో తరగతి టాపర్లతో కలిసి మొక్కలు నాటిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్కలు నాటారు. విద్యార్థులను పర్యావరణ పరిరక్షకులుగా మారాలని ప్రోత్సహించడంతో పాటు ప్లాస్టిక్ కాలుష్యం తగ్గింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. బొగ్గు, గనుల శాఖ పర్యావరణ పరిరక్షణలో కీలకంగా పనిచేస్తుందని చెప్పారు.

Kishan Reddy: పర్యావరణ దినోత్సవ వేళ పదో తరగతి టాపర్లతో కలిసి మొక్కలు నాటిన కిషన్ రెడ్డి
G Kishan Reddy

Updated on: Jun 05, 2025 | 10:27 PM

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని తన అధికార నివాసం (6, అశోకా రోడ్) వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో టాప్ ప్లేసుల్లో నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి, పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడడానికి గ్రామస్థాయిలో కృషి చేస్తున్నవారిని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం… ప్లాస్టిక్ కాలుష్యం వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం చేయడం, పునరాలోచించడం వంటి చర్యలపై ఫోకస్ పెట్టింది.

పర్యావరణ పరిరక్షణలో బొగ్గు, గనుల శాఖ కీలక కార్యక్రమాలు తన ఎక్స్‌ పోస్ట్‌లో కిషన్ రెడ్డి హైలెట్ చేశారు. అవేంటో దిగువన తెలుసుకుందాం..

గనుల భూమి పునర్వినియోగం: ఈ ఆర్థిక సంవత్సరంలో 2,459 హెక్టార్ల గనుల భూమిని పార్కులు, అటవీ ప్రాంతాలుగా మార్చారు. 54 లక్షల మొక్కలు నాటారు.

సౌరశక్తి ప్రోత్సాహం: 2025-26 నాటికి 3 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని, 2030 నాటికి 9 గిగావాట్ల సామర్థ్యానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు

శక్తి మార్పిడి: బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, భారతదేశం పునరుత్పత్తి శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

ఖనిజ భద్రత: గ్రీన్ టెక్నాలజీల కోసం ముఖ్యమైన ఖనిజాల భద్రతను పెంపొందించేందుకు రూ. 16,300 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..