
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతోన్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని దియోగర్‌లో రోడ్ షో నిర్వహించారు. లోక్ సభ అభ్యర్థి సుభాష్ చంద్ర పాణిగ్రాహితో కలిసి దేవ్‌గఢ్‌లో రోడ్ షో నిర్వహించారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైనా పాణిగ్రాహి దేవ్‌గఢ్ పార్లమెంటరీ స్థానం నుంచి మళ్లీ నామినేట్ అయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. ప్రధాని మోదీపై దేశ ప్రజలకు అంచంచల విశ్వాసం ఉందని తెలిపారు. మోదీ గడిచిన 10 ఏళ్లలో దేవ్‌గఢ్ జిల్లాలో రూ. 2,200 కోట్లతో పనులు చేశారు. అలాగే దేవ్‌గఢ్ జిల్లాలో జాతీయ రహదారి, కొత్తగా రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దేశ్వర్ బాబా మహాదేవ్ ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి.. తాను మోదీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చానంటూ ప్రజలతో ముచ్చటించారు.
#WATCH | Dharmendra Pradhan, Union Minister and BJP Lok Sabha candidate from Sambalpur, holds a roadshow in Deogarh, under the Sambalpur parliamentary constituency in Odisha.#LokSabhaElections2024 pic.twitter.com/P9PPdOW9B3
— ANI (@ANI) April 7, 2024
ఇదిలా ఉంటే ఒడిశాలో మొత్తం 21 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు నాలుగు లోక్ సభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13, 20, 25 జూన్ 1వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతాదల్ 21 స్థానాల్లో 20 స్థానాలు కైవసం చేసుకోగా, బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే 2019 ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారాయి. సీట్ల సంఖ్య 12కి తగ్గా, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. దీంతో ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..