Ashwini Vaishnaw: స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కసారిగా కింద పడేసిన కేంద్ర మంత్రి.. అలా చేయడం వెనుక అసలు కారణం ఇదే.. వీడియో

|

Oct 04, 2022 | 3:07 PM

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతోంది. లక్షలాది కోట్లతో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, ప్రపంచంలోనే మెరుగైన సాంకేతిక రంగాన్ని రూపొందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.

Ashwini Vaishnaw: స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కసారిగా కింద పడేసిన కేంద్ర మంత్రి.. అలా చేయడం వెనుక అసలు కారణం ఇదే.. వీడియో
Ashwini Vaishnaw
Follow us on

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఆరవ ఎడిషన్ కార్యక్రమం ఢిల్లీలో కొనసాగుతోంది. ఐఎంసీలో దేశవ్యాప్తంగా 5G సేవలను ప్రారంభించడం, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతోంది. లక్షలాది కోట్లతో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, ప్రపంచంలోనే మెరుగైన సాంకేతిక రంగాన్ని రూపొందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022లో సెన్సోరైస్ సెన్స్‌ఐటీ ఎనర్జీ MAID ( మల్టీ యాక్సెస్ IoT పరికరం)ని ప్రారంభించారు. MAID అనేది మేక్ ఇన్ ఇండియా IoT సొల్యూషన్.. ఇది ఆత్మనిర్భర్ భారత్ డ్రైవ్ కింద ప్రారంభించారు. ఇది ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. ఫోన్‌ను కింద పడేస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. భారతదేశంలో రూపొందించిన మొబైల్ హ్యాండ్‌సెట్ బలం, మన్నికను తనిఖీ చేయడానికి మంత్రి ఈవెంట్‌లో మొబైల్ హ్యాండ్‌సెట్‌ను కిందపడేస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.

కేంద్ర మంత్రి ఫోన్‌ను గణనీయమైన ఎత్తు నుంచి పడేయడాన్ని చూడవచ్చు. అది నేరుగా కింద పడుతుంది. ఏది ఏమయినప్పటికీ ఆయన ఫోన్‌ను తీసుకొని.. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎగ్జిబిటర్లు దాని పూర్తి సాంకేతికకు సంబంధించిన అంశాలను వివరిస్తున్నప్పుడు ఆయన స్మార్ట్‌ఫోన్ ను కింద పడేసి.. దాని మన్నికను, బలాన్ని తనఖీచేశారు.

వీడియో చూడండి..

వీడియోలో చూసినట్లుగా.. ఫోన్ కింద పడినప్పటికీ.. దానికి ఎటువంటి నష్టం జరగదు. డిస్‌ప్లే కూడా ఖచ్చితమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది.

డ్రాప్ పరీక్షలు..

స్మార్ట్‌ఫోన్ బలం, మన్నికను తనిఖీ చేయడానికి డ్రాప్ పరీక్షలు నిర్వహిస్తారు. నిజ జీవిత దృశ్యాలను అనుకరించడానికి, ప్రభావాన్ని అంచనా వేయడానికి స్మార్ట్‌ఫోన్‌లు సాధారణంగా ముందుగా నిర్వచించన ఎత్తు నుంచి.. అంటే సాధారణంగా వినియోగదారు ఛాతీకి సమానమైన ఎత్తు నుంచి కింద పడేసి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ డ్రాప్ పరీక్షలు ముందు, వెనుక, ఇరు వైపులా నిర్వహిస్తారు. ఆ తర్వాత పలు అంశాల ఆధారంగా దానిని రూపొందిస్తారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు డ్రాప్ టెస్ట్‌లు ఎక్కువగా వినియోగదారులు సైతం తనిఖీలు నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..